Monday 15 September 2014

నేడు మెదక్, నందిగామ ఉప ఎన్నికల కౌంటింగ్..

హైదరాబాద్: మెదక్‌ లోక్‌సభ, నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితం నేడు తేలనుంది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్‌ జరగనుంది.
కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..
పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతమ్ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, గజ్వేల్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జా తెలిపారు.
ఓట్ల లెక్కింపు మొదలైన మూడు గంటల్లోనే ఫలితాలు
ఓట్ల లెక్కింపు మొదలైన మూడు గంటల్లోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారు తెలిపారు. ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
నందిగామలోని కేవీఆర్‌ కాలేజ్‌లో కౌంటింగ్‌..
మరోవైపు కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితం కూడా తేలనుంది. నందిగామలోని కేవీఆర్‌ కాలేజ్‌లో కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్‌ శాతం తగ్గడంతో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

No comments:

Post a Comment