Friday 12 December 2014

పెళ్లిలో గల్లాలు పట్టుకున్న విష్ణువర్ధన్‌, వంశీచందర్‌ నీది తప్పంటే నీది తప అని నిందించుకున్న నేతలు పోలీసుల స్వాధీనంలో సిసిటివి ఫుటేజి

న్యూ ఢిల్లీ, డిసెంబర్‌ 12: వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. వీరి పేర్లు విష్ణువర్ధన్‌ రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి. విష్ణువ ర్ధన్‌ రెడ్డి సుప్రసిద్ధ కాంగ్రెస్‌ నాయకుడు పిజెఆర్‌ కుమారుడు. వంశీచందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే. వేదిక హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌. అక్కడ విష్ణు బావమరిది వివాహం జరుగుతోంది. 

అక్కడ ఆకస్మికంగా జరిగిన సంఘజన వివాహానికి వచ్చిన అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇద్దరిమధ్యా ఏమైందో ఏమో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వారిది తప అంటే వారిది తప అని పరస్పరం ఆరోపించుకున్నారు. చిన్న ఘర్షణగా ప్రారంభమై చినికి చినికి గాలివానగా మారి ఇరువురూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకునేవరకూ వెళ్లింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోవడంలేద ంటూ విష్ణు, తమ తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు విష్ణు ఫిర్యాదును కూడా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, 

వంశీ అనే వ్యక్తి పిలవని పెళ్లికి వచ్చాడని విష్ణు ఆరోపించారు. జరిగిన సంఘటన గురించి విష్ణు వివరిస్తూ తాను, తమ సోదరి, తల్లి వచ్చిన అతిథులను రిసీవ్‌ చేసుకుంటున్నామని, అపడు అటు వచ్చిన ... అని మీడియాకు చెబుతూ ఆ వ్యక్తి పేరును తమ సహచరులను అడిగి వంశీ అని ఆయన చెప్పారు. వంశీ ... చందర్‌ అంట, ఎమ్మెల్యే అంట ... గొడవపడాలనుకుంటే గాంధీ భవన్‌ ఉంది, గ్రౌండ్‌కైనా సరే, మహబూబ్‌నగర్‌లోనైనా సరే అని ఆయన సవాలు విసిరారు. వంశీ మహబూబ్‌నగర్‌లో పుట్టాడని, తాను హైదరాబాద్‌లో పుట్టానని చెబుతూ తాను పిజెఆర్‌ కుమారుడినని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయని విష్ణు వ్యాఖ్యానించారు. 

అయితే విష్ణువర్ధన్‌ రెడ్డే తనపైనా, గన్‌మ్యాన్‌పైనా దాడి చేశాడని, కావాలంటే సిసిటివి ఫుటేజ్‌ చూసుకోవచ్చునని వంశీచందర్‌ రెడ్డి వివరించారు. ఇపడు ఎక్కడ ఏ నేరం జరిగినా ఎవరిది తప అన్న విషయాన్ని సిసిటివి ఫుటేజి చూసి తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వివాహానికి వెళ్లినపడు విష్ణు ముందు మాట్లాడుతున్నట్టు మాట్లాడి వేళ్లు విరిచే ప్రయత్నం చేశాడని, తనను రక్షించడానికి ముందుకు వచ్చిన సాయుధ భద్రతా సిబ్బందిపై విష్ణు చేయిచేసుకున్నాడని ఆయన ఆరోపించారు. తాను పెళ్లి కుమార్తె తరపున వివాహానికి హాజరైనట్టు వంశీ వివరణ ఇచ్చారు. 

వీరిద్దరి మధ్య ముందు పార్కింగ్‌ వద్ద గొడవ జరిగిందని, అదే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అయితే వివాహ వేదికవద్ద జరిగిన ఘర్షణ సిసిటివిలో రికార్డు అయ్యిందిగాని పార్కింగ్‌ వద్ద జరిగిన గొడవ మాత్రం రికార్డు కాలేదని తెలుస్తున్నది. అయితే పోలీసులు అన్ని కెమేరాలలో రికార్డు అయిన ఫుటేజిని స్వాధీనం చేసుకుని అసలు ఏం జరిగిందో దర్యాప్తు ప్రారంభించారు. 

తెంలగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నాల ఇరువురికీ ఫోన్‌ చేసి అసలు ఏం జరిగిందీ తెలుసుకున్నారు. ఇలా బహిరంగంగా గొడవపడకూడదని ఆయన ఇద్దరికీ హితవు చెప్పినట్టు తెలుస్తున్నది.

No comments:

Post a Comment