Saturday 27 December 2014

పూచీ పడిన పాపానికి...రజనీకాంత్ ఆస్తుల వేలం?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తులలో కొన్ని వేలంపాటకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొచ్చాయడన్ సినీ నిర్మాణ సంస్థకు సంబంధించిన రుణం విషయంలో పూచికత్తు ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తనట్లు తెలుస్తోంది. రుణం ఇచ్చిన ఎగ్జిమ్ బ్యాంకు వేలం పాటకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే రాజీ దిశగా రజినీ కాంత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
రజినీ కుమార్తె దర్శకత్వం వహించిన కొచ్చాడయన్ సినిమాను మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఈ సినమాకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు అయ్యింది. అందులోంచి కొంత భాగం ఎగ్జిమ్ బ్యాంకు రుణంగా సమకూర్చింది. ఇందుకుగానూ రజినీ సతీమణి లతకు సంబంధించిన 2.13 ఎకరాల స్థలాన్ని పూచికత్తుగా పెట్టినట్లు తెలుస్తోంది. కొచ్చాడయన్ అంత కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. దీంతో బ్యాంకు వడ్డీ అసలు లెక్కగట్టి రూ. 22.21 కోట్లు తమకు రావాల్సి ఉందని ప్రకటించింది. దీనిపై పూచికత్తుగా ఉన్న లత రజినీకాంత్ కు నోటీసులు జారీ చేశారు. ఈ యేడాది జులై17 తేది చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 
 
అయితే ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో భూమిపై లవాదేవీలు తమకు తెలియకుండా జరపడానికి వీల్లేదంటూ బ్యాంకు ప్రకటన కూడా విడదల చేసింది. ఈ మేరకు తమ డబ్బులు రాబట్టుకోవడానికి వేలంపాటకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మీడియావన్ గ్లోబల్ సంస్థ రుణం తీసుకున్నది నిజమేనని, తాము మార్చిలోపు చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. మరోవైపు రజినీకాంత్ కూడా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. 

No comments:

Post a Comment