Monday, 22 September 2014

దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియా బిగ్ ఫైట్

దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియా బిగ్ ఫైట్!బాలీవుడ్ తార దీపికా పదుకొనె, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాల మధ్య మాటల యుద్ధం ఊపందుకుంది. గత కొద్దికాలంగా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని దీపికా, టైమ్స్ ఆఫ్ ఇండియాలు ఒకరిపై కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. 
నా ప్రొఫెషన్ కు నేను కొత్తేమి కాదు. పాత్రలు డిమాండ్ మేరకు తాను నడుచుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా దుస్తులు ధరించాల్సి రావోచ్చు. లేదా నగ్నంగా నటించాల్సి రావొచ్చు.  అలాంటి పాత్రలు ధరించాలా వద్దా అనే విషయంపై తన ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటాను. అయితే పాఠకుల దృష్టిని ఆకర్షించేందుకు ఒక రకమైన సిద్దాంతాన్ని పెట్టుకుని నాసిరకమైన ఎత్తులతో మహిళ గౌరవాన్ని దిగజార్చడం పద్దతి కాదు. ఎన్నడైనా పురుషుడి, మహిళ శరీరంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా.. షారుక్ 8 ప్యాక్ గురించి తప్పుడు పద్దతిలో కథనాన్ని ప్రచురించారా అంటూ తాజాగా దీపికా పదుకొనె ఫేస్ బుక్ లో ఓ వ్యాసాన్ని రాశారు. రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు చాలా వ్యత్యాసం ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్ లైన్ కోట్ చేసింది. హెడ్ లైన్ ద్వారా అమ్ముకోవడానికి మహిళల వక్షోజాలను, పురుషాంగాలను, ఇతర శరీర భాగాలను ఎంపిక చేసుకోవడం సమర్ధనీయమా అంటూ ప్రశ్నించారు. 
ఫేస్ బుక్ లో దీపికా పోస్ట్ కు జవాబుగా..పాయింట్ ఆఫ్ వ్యూ:
మీ రీల్, రియల్ లైఫ్ వాదనను మేము అంగీకరిస్తున్నాం. చాలా రోజులుగా తెరమీద కాకుండా బయట అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో డాన్యులు చేయడం, మ్యాగజైన్ కవర్ కు ఫోజులివ్వడం లాంటి కనిపిస్తున్నాయి.అక్కడ నీవు ఏలాంటి రోల్ లో నటిస్తున్నారు? ఎందుకు ఆ హిపోక్రసీ? ఇంతకు ముందు ఇతర మీడియా సంస్థలు నీ వక్షోజాలతో ఫోటోలు పోస్ట్ చేశారు. అప్పుడు అడ్డు చెప్పని నీవు.. ఇప్పుడే ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు? అంటూ ఫేస్ బుక్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కౌంటర్ ఇచ్చారు. సెక్సీ షారుక్ ఖాన్ 8 ప్యాక్ అంటూ హెడ్ లైన్ పెట్టలేం కదా అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఎవరి అభిప్రాయాలను చెప్పుకోవడానికి వారికి హక్కు ఉంటుంది? ఈ వివాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్లి ఆకర్షణీయమైన హెడ్ లైన్ తో ప్రాముఖ్యం లేని హెడ్ లైన్ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఇంటర్వ్యూలు ట్వీట్ చేయడం చూస్తున్నాం. అదీ మీ పబ్లిసిటీకి, మీ సినిమాల ప్రమోషన్ కు బాగా ఉపయోగపడ్డాయి. యూట్యూబ్ లో ఉన్న మీ వీడియోలపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా మీకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోగ్రాఫులు మీడియాలో రావడంపై మా మీడియా మిత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో వెల్లడించింది. 
గత కొద్ది రోజుల క్రితం దీపికా పదుకొనె వక్షోజ ప్రదర్శన చేసిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు వెబ్ సైట్ ఓ కథనాన్నిప్రచురించింది. ఆ కథనంపై స్పందిస్తూ.. నేను మహిళను, నాకు వక్షోజాలు ఉన్నాయి.. మీకు వచ్చిన సమస్యేమిటి?. మహిళను గౌరవించడం చాతకాకపోతే.. మహిళా చైతన్యం అంటూ మాట్లాడవద్దు అంటూ దీపిక ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఎక్కడికి దారి తీస్తుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనానికి దీపికా మళ్లీ కౌంటర్ ఇస్తుందా లేక ఇంతటి ఆగుతుందా అనే వేచి చూడాల్సిందే. 

చంద్రబాబు రాయ్ పూర్ పరిశీలన

చంద్రబాబు రాయ్ పూర్   పరిశీలనఛత్తీస్ గఢ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛత్తీస్ గఢ్ చేరుకున్నారు. రాజధాని రాయ్ పూర్ నిర్మాణాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు ఇక్కడి వచ్చారు. ఆయన వెంట మంత్రులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో చంద్రబాబు సమావేశమవుతారు.

ఏపిలో రాజధాని నిర్మాణం కోసం దేశవిదేశాలలో పలు పట్టణాలను పరిశీలిస్తున్న నేపధ్యంలో మంత్రుల బృందం  రాయ్ పూర్ ను సందర్శించనుంది

స్పీకర్ ముందుకు మెట్రో ఫైళ్ళు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మెట్రో రైలు ఫైళ్ళను అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలూ పరిశీలించేందుకు వీలుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పెట్టాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌పై రేవంత్ రెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. తాను వాస్తవాలు చెబితే పరువు నష్టం దావా వేస్తామంటున్నారని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. గేమింగ్ సిటీ కోసం లోగడ కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. రెండు వేల కోట్ల రూపాయలతో భూములు ఖరీదు చేసినట్లు మైహోం రామేశ్వర రావు చెప్పారని ఆయన గుర్తు చేశారు. రామేశ్వర రావుకు మద్దతుగా సిఎం కిరణ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమం వద్ద టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, డిఎల్‌ఎఫ్ కంపెనీకి ఏమైనా సంబంధం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. గేమింగ్ సిటీ భూములను ఇతరులకు ఇచ్చే అవకాశం లేదని చెప్పిన ఎపిఐఐసి చైర్మన్ రంజన్ ఎవరి వత్తిడి వల్ల దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. తమ భూములు గేమింగ్ సిటీకి ఇస్తే మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని ఎల్‌అండ్‌టి ప్రభుత్వానికి లేఖ రాయడం నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తనపై పరువు నష్టం దావా వేస్తామన్న రామేశ్వర రావు ప్రకటనను స్వాగతిస్తున్నానని అన్నారు. టిఆర్‌ఎస్ మైండ్ గేమ్ తన ముందు పని చేయలేదని ఆయన చెప్పారు. మెట్రో భూములపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని అన్నారు. ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు తనతో చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్రం. . విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

మహారాష్ట్ర ఎన్నికలు : హలో ఉద్ధవ్.. అమిత్ షా ఫోను!

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ-శివసేన కూటమి విభేదాలకు చెక్ పెట్టేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇరవై ఐదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన బీజేపీ-శివసేన కూటమిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విభేదాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 
 
వెంటనే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించవద్దని కోరారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇస్తామన్న 119 స్థానాల ప్రతిపాదన 'అసాధ్యమైనది' అనీ, ఆ విషయంలో మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

తెరాసపై రేవంత్ రెడ్డి విమర్శలు.. ఎర్రబెల్లికి కేసీఆర్ గాలం!

errabelli dayakar raoహైదరాబాద్ మెట్రో రైల్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు సొంత పార్టీ నేతల్లో విభేదాలు సృష్టిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్... టీటీడీపీ అసంతృప్తి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి సీనియర్ నేతలకు గాలం వేయడంలో దృష్టిసారించారు. 
 
గత రెండు రోజులుగా తెరాస నేతల్లో ఎర్రబెల్లి దయాకర రావు 'కేంద్రం'గా టీఆర్ఎస్, టీడీపీ‌ల మధ్య రసవత్తర రాజకీయాలు నడుస్తున్నట్టు సమాచారం. మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు ఎర్రబెల్లి‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడు. మెట్రో భూముల విషయంలో రామేశ్వర రావు‌పై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో ఎర్రబెల్లి విభేదించారు. చంద్రబాబు కూడా రేవంత్‌కే మద్దతిస్తున్నారని ఆయన కొన్ని రోజులుగా కినుక వహించినట్టు సమచారం. 
 
దీన్ని అవకాశంగా మలుచుకుని టీఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లిని తమ వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామేశ్వర రావు మధ్యవర్తిత్వం ద్వారా ఎర్రబెల్లిని తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని సమాచారం. అయితే, ఆఖరి నిమిషంలో టీడీపీ అప్రమత్తం కావడంతో... టీఆర్ఎస్ ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది.
 
పైగా ఈ వార్తలను ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఖండించకపోవడం విశేషం. టీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా తనపై ఐదురోజులుగా విపరీతమైన ఒత్తిడి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే, దీనికి తాను అంగీకరించలేదని.. జీవితాంతం తాను టీడీపీలోనే కొనసాగుతానని, చంద్రబాబే తన నాయకుడని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆదివారం రాత్రి 11 గంటలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చిన మాట నిజమేనని ఎర్రబెలి తెలిపారు. కేవలం, కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి గురించి మాట్లాడటానికే తాను సీఎం కేసీఆర్‌ను కలవాలనుకున్నట్టు ఎర్రబెల్లి వివరణ ఇచ్చి సరిపుచ్చుకున్నారు. 

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ
అనంతపురం : వచ్చే ఎన్నికల్లో తన తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత తెలిపారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోమవారమిక్కడ హెచ్చరించారు. కాగా గత కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని పరిటాల సునీత వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం అవసరమని చంద్రబాబు ఆదేశాలతో శ్రీరామ్ పోటీ నుంచి తప్పుకున్నట్లు  కథనాలు వెలువడ్డాయి.  ఎన్నికలు రావటానికి ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉన్నా ....పరిటాల సునీత తన వారసుడిని ముందుగానే ప్రకటించేయటం విశేషం.

బతుకమ్మ: మహిళలతో రోడ్డుపై విహెచ్

హైదరాబాద్: అంబర్‌పేట బతుకమ్మకుంటను కబ్జాదారుల బారి నుంచి రక్షించి, కుంటను అభివృద్ది చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతుకమ్మకుంట భూములను పరిరక్షించాలని కోరుతూ ఆయన ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలతో కలిసి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న విహెచ్‌ను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో వి.హనుమంతురావు మాట్లాడుతూ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్లే బతుకమ్మకుంట అని పేరు వచ్చిందని, ఇలాంటి బతుకమ్మకుంటపై కొంతమంది కబ్జాదారులు కన్నేసి, నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి మట్టితో కుంటను పూడ్చి వేసి కబ్జా చేశారని ఆరోపించారు.