Sunday, 30 November 2014

హ్యాపీగా శ్రీజ బర్త్‌డే ఆస్పత్రిలో పవన్‌ అభిమాని పుట్టినరోజు వేడుక ఈ వారంలో డిశ్చార్జ్‌ చేస్తాం: వైద్యులు

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? లేకపోతే పక్కన ఉన్న ఫొటో చూడండి! ఆ.. ఆ పాపే!! మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ పవన్‌ కల్యాణ్‌ను చూడాలని తపించిన ఆ చిన్నారి శ్రీజనే ఈమె. వైద్యుల చేతి చలువ.. పవన్‌ పరామర్శ బలం.. ఫలించి కోలుకుంది. ఆస్పత్రిలోనే ఆదివారం పుట్టినరోజు జరుపుకొంది.
ఖమ్మం (చర్చి కాంపౌండ్‌), నవంబర్‌ 30: ‘ఎక్యూట్‌ డిస్సెమినేటెడ్‌ ఎన్‌సెఫలోమైలైటిస్‌’తో 3 నెలలుగా ఖమ్మంలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ... ఆమెను చూసేందుకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆస్పత్రికి వెళ్లి కంటతడి పెట్టిన సంగతి గుర్తుందా? ఇప్పుడా పాప క్షేమంగా ఉంది. ఆదివారం ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్‌ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్‌ చేస్తామని.. శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ అసాధారణ్‌ తెలిపారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై అందరూ వాకబు చేస్తుండటంతో ఆస్పత్రిలోనే జన్మదిన వేడుక జరిపి, విలేకరులను పిలిచి, అందరికీ ఆమె పరిస్థితి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను’ అని చెప్పింది. ఆమె తనంతట తానే నడవగలుగుతోంది. కొద్దికొద్దిగా తినగలుగుతోంది. కాగా.. శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో 21రోజులు శ్రీజను ఐసీయూలో ఉంచినా, చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, కొందరి సలహా మేరకు ఖమ్మం తీ
సుకొచ్చామన్నారు. శ్రీజ కోలుకోవడం లో డాక్టర్‌ అసాధారణ్‌, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆమెను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌కు, ఆర్థిక సహాయం చేసిన పవన్‌ అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్‌లోని తన తోటి ఉద్యోగులకు, పవన్‌ కల్యాణ్‌ రాక కోసం కృషిచేసిన ‘మేక్‌ ఎ విష్‌’ సంస్థకు, మీడియాకు.. వారు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్‌ మళ్లీ వస్తాడా?
‘శ్రీజా.. నేను పవన్‌ కల్యాణ్‌ను వచ్చాను లేమ్మా’.. అక్టోబర్‌ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ పలకరించిన తీరిది! ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్‌ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ అంటే ప్రాణం పెట్టే శ్రీజ.. తనకోసం ఆ పవర్‌స్టారే దిగివచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది. కొద్దిసేపు కళ్లు తెరిచినా అది గుర్తుందో లేదో. ఇప్పుడామె కోలుకుంది. పవన్‌ ఆమెను చూడ్డానికి మళ్లీ వెళ్తాడా? పరామర్శిస్తాడా? చిన్నారి అభిమానికి ఆనందం కలిగిస్తాడా? మాట నిలబెట్టుకుంటాడా?వేచి చూడాల్సిందే!!

సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టినందుకు హత్య

విశాఖపట్నం: నిత్యం తన చెల్లెలను వేధించడంతోపాటు, ఆమెతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టడాన్ని తట్టుకోలేని ఓ సోదరుడు తన బావమరిదిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గబ్బంగి పంచాయతీ పనసపల్లికి చెందిన పాంగి తిరుపతి రావు(40) చిన్నాన్న కుమార్తె పార్వతమ్మను జీ మాడుగుల మండలం సింగర్భకు చెందిన చిట్టిబాబు(35)కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం చిట్టిబాబుతో అతడి కుటుంబాన్ని పనసపల్లికి తెచ్చిన తిరుపతి రావు అతడికి కొన్ని పశువులను అప్పగించి పశువుల కాపరిగా ఉంచాడు. గత ఏడాది ఇద్దరి మధ్య మసస్పర్థలు రావడంతో తన భార్యతో తిరుపతి రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ చిట్టిబాబు ప్రచారం చేయడం ప్రారంభఇంచాడు. మద్యం తాగి వచ్చి గొవడపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో పార్వతమ్మ శనివారం కూలీ పనుల కోసం వెళ్లింది. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో భర్త చనిపోయి ఉండటంతో పార్వతమ్మ..సమీపంలోనే ఉన్న సోదరుడు తిరుపతి రావు ఇంటికెళ్లి వదినకు చెప్పింది. చిట్టిబాబు దుష్ప్రచారాన్ని తట్టుకోలేక అతనిని చంపేశానని చెప్పి తిరుపతి రావు గ్రామం వదిలి వెళ్లాడని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. హైవేపై దొంగతనం జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపు గట్టు దగ్గర ఒక కారు పై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సు పై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది

కరీంనగర్‌లో పేలుడు, చెల్లాచెదురైన శరీర భాగాలు

హైదరాబాద్: కరీంనగర్‌ శివారులో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీ ఓ ఇంట్లో ఆదివారం ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. ఈ పేలుడు సంఘటనలో కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన పట్నం నాగార్జున కుమార్‌ (34), మ ల్లు రామకృష్ణారెడ్డి (60)లు దుర్మరణం చెందగా పట్నం శ్రీనివాస్‌కుమార్‌ (26)కు తీవ్రగా యా లతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరబాద్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పట్నం నాగార్జున కుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌ సోదరులు 12 సంవత్సరాల నుంచి కరీంనగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో దేవతలు, ఇతర బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీరి వద్ద వంట మనిషిగా అదే గ్రామానికి చెందిన మల్లు రామకృష్ణారెడ్డి పని చేస్తున్నాడు. ఇంట్లోని రెండు గదులను గోదాంగా చేసి అక్కడే బొమ్మల తయారీకి ఉపయోగించే రసాయనాలు నిల్వ ఉంచుతారు. అయితే శనివారం మద్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంటి ఆవరణలో పేలుడు జరిగింది. గడువు ముగిసిన హార్డినరీ రసాయనంపై ఒత్తిడి కారణంగానే అది పేలిందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక పోస్టాఫీసుల్లోనూ శ్రీవారి దర్శన టికెట్లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
 
చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులోను, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభిస్తారు.
 
ఇవి ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు

మరోసారి తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ముంబై, నవంబర్‌ 30 : వాహనదారులకు శుభవార్త... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 70 లు కన్నా దిగువకు రానునంది. లీటరు డీజిల్‌ ధర స్థానిక పన్నులతో కలిసి రూ. 57 రూపాయలకు చేరనుంది. తగ్గిన పెట్రో ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 70 డాలర్లకన్నా తక్కువకు పడిపోవడంతో ఈ మేరకు ధరలు తగ్గాయి. పెట్రోలు ఎగుమతి దేశాలు సైయితం ఉత్పత్తిని తగ్గించబోమని ప్రకటించాయి

ఈవ్‌ టీజర్‌ భరతం పట్టిన ఇద్దరు అమ్మాయిలు


హర్యానా, నవంబర్‌ 30 : బస్సులో ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన పోకిరిని ఇద్దరు అమ్మాయిలు బెల్ట్‌ తీసి చితక్కొట్టారు. ఈ ఘటన హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగింది. బస్సులో అంతమంది ప్రయాణీకులు ఉన్నా ఎవరూ వీరికి సాయం రాలేదు. ఆ ఇద్దరు అమ్యాయిలే ధైర్యంగా పోకిరీని ఎదుర్కొన్నారు. దాంతో ఆగకుండా ఆ పోకిరిని పోలీసులకు అప్పగించారు

Friday, 28 November 2014

బతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె విగ్రహాన్ని కూడా మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల పెట్టించారు. ఇప్పుడు బతికుండగానే విగ్రహాలు పెట్టించుకునే లిస్టులోకి పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పవన్‌కళ్యాణ్ విగ్రహం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరంలో విగ్రహం కూడా తయారైపోతోంది. కొంతమంది జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్డర్ ఇచ్చిన మీదట ఈ గ్రామానికి చెందిన శిల్పి అరుణప్రసాద్ వడయార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.