Wednesday 17 September 2014

మూడు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్ - చైనా

న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనలో భాగంగా అహ్మాదాబాద్ చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. హయత్ హోటల్‌లో జరిగిన ఈ భేటీ అనంతరం మూడు అవగాహన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు. తొలి ఒప్పందం గుజరాత్ - గాంజా ప్రావిన్స్ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శులు చేశారు. గుజరాత్‌లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు తొలి ఒప్పందం కుదిరింది. ఇక రెండో ఒప్పందానికి వస్తే చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ - గుజరాత్ పారిశ్రామికాభివృద్ది మధ్య జరిగింది. రెండో ఒప్పందంపై ఉపాధ్యక్షుడు, గుజరాత్ పారిశ్రామికాభివృద్ది కార్పోరేషన్ కార్యదర్శి సంతకాలు చేశారు. ఈరోజు సాయంత్రం జిన్ పింగ్ సబర్మతీ 


మూడు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్ - చైనా






ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతీ తీరాన ఉన్న రివర్ ఫ్రంట్ గార్డెన్‌లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎంతో పాటు అత్యంత ముఖ్యలు పాల్గోంటారు. ఈ విందులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు స్దానిక వంటకాలే వడ్డించనున్నారు. అనంతరం రాత్రికి ఢిల్లీ వెళతారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, విదేశీ వ్యవహరాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలను ఆయన కలవనున్నారు.

No comments:

Post a Comment