తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. టీడీపీని వీడి ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు.
తనతో పాటు, మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్‌లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావును తమ పార్టీలోకి ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవిని ఆఫర్‌ను చేసినట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయంపై ఎర్రబెల్లి తన అనుచరులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు
No comments:
Post a Comment