బాహుబలి సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. ఈ సమయాన్ని కూడా రాజమౌళి వృదా చేయనీయకుండా తన ఆర్టిస్టులతో క్రికెట్ ఆడించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ 'బాహుబలి'గా, రానా 'బల్లాల దేవా'గా నటిస్తున్నారు. దీంతో వీరిద్దరి పేరిట రెండు టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారట.
టాలీవుడ్‌లోని యువ నటులను ఈ రెండు టీములలోకి తీసుకుని పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తారని అంటున్నారు. త్వరలో భారీ ప్రచారంతో ఈ మ్యాచ్‌ను భారీ స్థాయిలో నిర్వహించడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
No comments:
Post a Comment