Wednesday, 15 October 2014

ఓల్వో బస్సు బోల్తా కొట్టింది... ప్రయాణికులు సేఫ్!

ఓల్వో బస్సులు ప్రమాదాలకు లోను కావడం సర్వసాధారణమైపోయింది. వోల్వో బస్సు ప్రమాదాలకు గురికావడం ఫ్యాషనైపోయింది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద బుధవారం వోల్వో బస్సు బోల్తా పడిన ఘటనలో ప్రయాణికులు అదృష్టవశాత్తూ గాయపడలేదు.

బస్సు బోల్తా పడిన వెంటనే అవతలి రోడ్డుపై వెళుతున్న వాహనదారులు స్పందించి ప్రయాణికులను రక్షించడంతో ప్రమాదం తప్పింది. కాగా ఈ వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment