Thursday, 16 October 2014

ఖమ్మంకు బయలుదేరిన పవన్ కళ్యాణ్.. శ్రీజకు పరామర్శ!

pawan kalyanజనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం ఖమ్మంకు వెళ్లనున్నారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కారణంగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి శ్రీజ కోర్కె మేరకు పవన్ ఇక్కడకు వస్తున్నారు. మృత్యువుతో పోరాడుతున్న శ్రీజ.... తనకు పవన్ కల్యాణ్‌ను కలుసుకోవాలని వుందని కోరిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయాన్ని 'మేక్ ఏ విష్' స్వచ్ఛంద సంస్థ చేరడంతో ఆ సంస్థ ప్రతినిధులు హీరోకు చేరవేశారు. దీంతో, చిన్నారి కోరికను తీర్చడానికి ఆయన తన షెడ్యూల్‌ను పక్కన పెట్టి ఖమ్మం వెళుతున్నారు. మరోవైపు తమ అభిమాన నటుడు ఖమ్మం విచ్చేస్తుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. 

No comments:

Post a Comment