Saturday 27 December 2014

పూచీ పడిన పాపానికి...రజనీకాంత్ ఆస్తుల వేలం?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఆస్తులలో కొన్ని వేలంపాటకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కొచ్చాయడన్ సినీ నిర్మాణ సంస్థకు సంబంధించిన రుణం విషయంలో పూచికత్తు ఉన్న కారణంగా ఈ పరిస్థితి తలెత్తనట్లు తెలుస్తోంది. రుణం ఇచ్చిన ఎగ్జిమ్ బ్యాంకు వేలం పాటకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే రాజీ దిశగా రజినీ కాంత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. 
 
రజినీ కుమార్తె దర్శకత్వం వహించిన కొచ్చాడయన్ సినిమాను మీడియావన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఈ సినమాకు దాదాపు రూ. 120 కోట్లు ఖర్చు అయ్యింది. అందులోంచి కొంత భాగం ఎగ్జిమ్ బ్యాంకు రుణంగా సమకూర్చింది. ఇందుకుగానూ రజినీ సతీమణి లతకు సంబంధించిన 2.13 ఎకరాల స్థలాన్ని పూచికత్తుగా పెట్టినట్లు తెలుస్తోంది. కొచ్చాడయన్ అంత కలెక్షన్లను రాబట్ట లేకపోయింది. దీంతో బ్యాంకు వడ్డీ అసలు లెక్కగట్టి రూ. 22.21 కోట్లు తమకు రావాల్సి ఉందని ప్రకటించింది. దీనిపై పూచికత్తుగా ఉన్న లత రజినీకాంత్ కు నోటీసులు జారీ చేశారు. ఈ యేడాది జులై17 తేది చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. 
 
అయితే ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో భూమిపై లవాదేవీలు తమకు తెలియకుండా జరపడానికి వీల్లేదంటూ బ్యాంకు ప్రకటన కూడా విడదల చేసింది. ఈ మేరకు తమ డబ్బులు రాబట్టుకోవడానికి వేలంపాటకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మీడియావన్ గ్లోబల్ సంస్థ రుణం తీసుకున్నది నిజమేనని, తాము మార్చిలోపు చెల్లించడానికి సిద్ధమవుతున్నట్లు వివరించారు. మరోవైపు రజినీకాంత్ కూడా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. 

లైంగికంగా వేధించిన సన్ టీవీ సీఓఓ అరెస్టు!

sun tvసహ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినట్టు ఆధారాలతో సహా నిరూపించడంతో సన్ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సీఓఓ పేరు ప్రవీణ్. 
 
ఈ మేరకు బాధిత మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్టు చెన్నై నగర పోలీసులు వెల్లడించారు. గతంలో కూడా సూర్య టీవీ చెందిన ఒక మాజీ మహిళ ఉద్యోగి ఈ ఆరోపణ చేసి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ప్రవీణ్‌ను అన్నా నగర్‌లోని ఆయన ఇంటి వద్ద అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Monday 22 December 2014

ఐదేళ్ల బాలికపై అత్యాచారం... ఆపై హత్య.

ముక్కు పచ్చలారని బాలిక.. ఆడుకోవడం తప్ప మరేమి తెలియ చిన్న పాప.. ఆ పాప ఆ కామాంధుల రక్కసి కోరలకు బలయ్యింది. ఆడుకుంటూ బయలకు వెళ్ళిన పాపానికి శవమై తేలింది. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన పలువురి చేత కంట తడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
బీహార్ లోని వైశాలి జిల్లా దామోదర్ పూర్ గ్రామంలో దేవతి దేవి కుమార్తె పూలు అమ్ముకుని నివసిస్తూ ఉంటుంది. పూలు అమ్మితే కానీ బతుకీడ్చలేని స్థితి వారిది. ఇలాంటి వారు చిన్నపిల్లలను తమతో తీసుకుపోతుంటారు. చుట్టుపక్కల ఆడుకుంటూ ఉంటే వీరు తమ వ్యాపారం చేసుకుని పది రూపాయలు సంపాదించి సంసారం సాగిస్తుంటారు. సరిగ్గా గురువారం దేవతీ దేవి కూడా తన ఐదేళ్ళ కూతుర్ని తీసుకుని పూలు అమ్ముకుంటూ ఉండిపోయింది. తన కుమార్తె అక్కడ ఇక్కడా ఆడుకుంటూ ఉండడంతో దేవి పూలమ్మడంలో మునిగిపోయింది.
 
కానీ కూతురు కనిపించకుండా పోయింది. దీంతో సారాయ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేదు. మరుసటి రోజే బాలిక శవమై ముళ్ల పొదల్లో తేలింది. తీరా అక్కడకెళ్ళి చూడగా బాలిక అత్యాచారానికి గురైనట్లు గుర్తించి విస్తుబోయారు.  గుర్తు తెలియని వ్యక్తులు బాలికపై అత్యాచారం చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు

.


Friday 12 December 2014

పెళ్లిలో గల్లాలు పట్టుకున్న విష్ణువర్ధన్‌, వంశీచందర్‌ నీది తప్పంటే నీది తప అని నిందించుకున్న నేతలు పోలీసుల స్వాధీనంలో సిసిటివి ఫుటేజి

న్యూ ఢిల్లీ, డిసెంబర్‌ 12: వారిలో ఒకరు మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. వీరి పేర్లు విష్ణువర్ధన్‌ రెడ్డి, వంశీచందర్‌ రెడ్డి. విష్ణువ ర్ధన్‌ రెడ్డి సుప్రసిద్ధ కాంగ్రెస్‌ నాయకుడు పిజెఆర్‌ కుమారుడు. వంశీచందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే. వేదిక హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌. అక్కడ విష్ణు బావమరిది వివాహం జరుగుతోంది. 

అక్కడ ఆకస్మికంగా జరిగిన సంఘజన వివాహానికి వచ్చిన అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. ఇద్దరిమధ్యా ఏమైందో ఏమో ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. వారిది తప అంటే వారిది తప అని పరస్పరం ఆరోపించుకున్నారు. చిన్న ఘర్షణగా ప్రారంభమై చినికి చినికి గాలివానగా మారి ఇరువురూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేసుకునేవరకూ వెళ్లింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తమ ఫిర్యాదును పోలీసులు తీసుకోవడంలేద ంటూ విష్ణు, తమ తల్లితో కలిసి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు విష్ణు ఫిర్యాదును కూడా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించిన ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, 

వంశీ అనే వ్యక్తి పిలవని పెళ్లికి వచ్చాడని విష్ణు ఆరోపించారు. జరిగిన సంఘటన గురించి విష్ణు వివరిస్తూ తాను, తమ సోదరి, తల్లి వచ్చిన అతిథులను రిసీవ్‌ చేసుకుంటున్నామని, అపడు అటు వచ్చిన ... అని మీడియాకు చెబుతూ ఆ వ్యక్తి పేరును తమ సహచరులను అడిగి వంశీ అని ఆయన చెప్పారు. వంశీ ... చందర్‌ అంట, ఎమ్మెల్యే అంట ... గొడవపడాలనుకుంటే గాంధీ భవన్‌ ఉంది, గ్రౌండ్‌కైనా సరే, మహబూబ్‌నగర్‌లోనైనా సరే అని ఆయన సవాలు విసిరారు. వంశీ మహబూబ్‌నగర్‌లో పుట్టాడని, తాను హైదరాబాద్‌లో పుట్టానని చెబుతూ తాను పిజెఆర్‌ కుమారుడినని, పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నాయని విష్ణు వ్యాఖ్యానించారు. 

అయితే విష్ణువర్ధన్‌ రెడ్డే తనపైనా, గన్‌మ్యాన్‌పైనా దాడి చేశాడని, కావాలంటే సిసిటివి ఫుటేజ్‌ చూసుకోవచ్చునని వంశీచందర్‌ రెడ్డి వివరించారు. ఇపడు ఎక్కడ ఏ నేరం జరిగినా ఎవరిది తప అన్న విషయాన్ని సిసిటివి ఫుటేజి చూసి తెలుసుకోవచ్చునని ఆయన అన్నారు. వివాహానికి వెళ్లినపడు విష్ణు ముందు మాట్లాడుతున్నట్టు మాట్లాడి వేళ్లు విరిచే ప్రయత్నం చేశాడని, తనను రక్షించడానికి ముందుకు వచ్చిన సాయుధ భద్రతా సిబ్బందిపై విష్ణు చేయిచేసుకున్నాడని ఆయన ఆరోపించారు. తాను పెళ్లి కుమార్తె తరపున వివాహానికి హాజరైనట్టు వంశీ వివరణ ఇచ్చారు. 

వీరిద్దరి మధ్య ముందు పార్కింగ్‌ వద్ద గొడవ జరిగిందని, అదే పెద్ద సమస్యగా మారినట్టు తెలుస్తున్నది. అయితే వివాహ వేదికవద్ద జరిగిన ఘర్షణ సిసిటివిలో రికార్డు అయ్యిందిగాని పార్కింగ్‌ వద్ద జరిగిన గొడవ మాత్రం రికార్డు కాలేదని తెలుస్తున్నది. అయితే పోలీసులు అన్ని కెమేరాలలో రికార్డు అయిన ఫుటేజిని స్వాధీనం చేసుకుని అసలు ఏం జరిగిందో దర్యాప్తు ప్రారంభించారు. 

తెంలగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పొన్నాల ఇరువురికీ ఫోన్‌ చేసి అసలు ఏం జరిగిందీ తెలుసుకున్నారు. ఇలా బహిరంగంగా గొడవపడకూడదని ఆయన ఇద్దరికీ హితవు చెప్పినట్టు తెలుస్తున్నది.

Tuesday 2 December 2014

రోగులపై అత్యాచారం .. కేన్సర్ వైద్యుడికి 22 యేళ్ల జైలు!

తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
మైల్స్ బ్రాడ్‌బరీ అనే ఆ వైద్యుడు కేంబ్రిడ్జిలోని అడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో రక్త కేన్సర్ నిపుణుడిగా పని చేసేవాడు. ఈయన వద్దకు వచ్చే రోగులను లైంగికంగా వేధిస్తూ.. వారిని లోబరచుకుని అత్యాచారం చేసేవాడు. ఈ విధంగా గత 2009లో 25 ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల వయసున్న బాలికపై కూడా అత్యాచానికి పాల్పడినట్టు సమాచారం. అత్యాచారం చేయడమే కాకుండా, తన కామకృత్యాలను వీడియోలు కూడా తీసేవాడు. 
 
దీనిపై కొందరు రోగులు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా 2013లో బ్రాడ్‌బరీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య సహాయం కోసం వచ్చిన 18 మంది యువతుల పట్ల మైల్స్ బ్రాడ్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడని, వాళ్ళు అతడ్ని ఎంతగానో నమ్మి వస్తే వారిపట్ల అసభ్యంగా ప్రవర్థించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది మిచెల్ బ్రౌన్ అన్నారు. 
 
ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లను కూడా అతడు వదల్లేదని, అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించడం భావ్యమేనని అభిప్రాయపడ్డారు.

Sunday 30 November 2014

హ్యాపీగా శ్రీజ బర్త్‌డే ఆస్పత్రిలో పవన్‌ అభిమాని పుట్టినరోజు వేడుక ఈ వారంలో డిశ్చార్జ్‌ చేస్తాం: వైద్యులు

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? లేకపోతే పక్కన ఉన్న ఫొటో చూడండి! ఆ.. ఆ పాపే!! మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ పవన్‌ కల్యాణ్‌ను చూడాలని తపించిన ఆ చిన్నారి శ్రీజనే ఈమె. వైద్యుల చేతి చలువ.. పవన్‌ పరామర్శ బలం.. ఫలించి కోలుకుంది. ఆస్పత్రిలోనే ఆదివారం పుట్టినరోజు జరుపుకొంది.
ఖమ్మం (చర్చి కాంపౌండ్‌), నవంబర్‌ 30: ‘ఎక్యూట్‌ డిస్సెమినేటెడ్‌ ఎన్‌సెఫలోమైలైటిస్‌’తో 3 నెలలుగా ఖమ్మంలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ... ఆమెను చూసేందుకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆస్పత్రికి వెళ్లి కంటతడి పెట్టిన సంగతి గుర్తుందా? ఇప్పుడా పాప క్షేమంగా ఉంది. ఆదివారం ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్‌ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్‌ చేస్తామని.. శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ అసాధారణ్‌ తెలిపారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై అందరూ వాకబు చేస్తుండటంతో ఆస్పత్రిలోనే జన్మదిన వేడుక జరిపి, విలేకరులను పిలిచి, అందరికీ ఆమె పరిస్థితి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను’ అని చెప్పింది. ఆమె తనంతట తానే నడవగలుగుతోంది. కొద్దికొద్దిగా తినగలుగుతోంది. కాగా.. శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో 21రోజులు శ్రీజను ఐసీయూలో ఉంచినా, చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, కొందరి సలహా మేరకు ఖమ్మం తీ
సుకొచ్చామన్నారు. శ్రీజ కోలుకోవడం లో డాక్టర్‌ అసాధారణ్‌, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆమెను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌కు, ఆర్థిక సహాయం చేసిన పవన్‌ అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్‌లోని తన తోటి ఉద్యోగులకు, పవన్‌ కల్యాణ్‌ రాక కోసం కృషిచేసిన ‘మేక్‌ ఎ విష్‌’ సంస్థకు, మీడియాకు.. వారు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్‌ మళ్లీ వస్తాడా?
‘శ్రీజా.. నేను పవన్‌ కల్యాణ్‌ను వచ్చాను లేమ్మా’.. అక్టోబర్‌ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ పలకరించిన తీరిది! ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్‌ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ అంటే ప్రాణం పెట్టే శ్రీజ.. తనకోసం ఆ పవర్‌స్టారే దిగివచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది. కొద్దిసేపు కళ్లు తెరిచినా అది గుర్తుందో లేదో. ఇప్పుడామె కోలుకుంది. పవన్‌ ఆమెను చూడ్డానికి మళ్లీ వెళ్తాడా? పరామర్శిస్తాడా? చిన్నారి అభిమానికి ఆనందం కలిగిస్తాడా? మాట నిలబెట్టుకుంటాడా?వేచి చూడాల్సిందే!!

సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టినందుకు హత్య

విశాఖపట్నం: నిత్యం తన చెల్లెలను వేధించడంతోపాటు, ఆమెతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టడాన్ని తట్టుకోలేని ఓ సోదరుడు తన బావమరిదిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గబ్బంగి పంచాయతీ పనసపల్లికి చెందిన పాంగి తిరుపతి రావు(40) చిన్నాన్న కుమార్తె పార్వతమ్మను జీ మాడుగుల మండలం సింగర్భకు చెందిన చిట్టిబాబు(35)కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం చిట్టిబాబుతో అతడి కుటుంబాన్ని పనసపల్లికి తెచ్చిన తిరుపతి రావు అతడికి కొన్ని పశువులను అప్పగించి పశువుల కాపరిగా ఉంచాడు. గత ఏడాది ఇద్దరి మధ్య మసస్పర్థలు రావడంతో తన భార్యతో తిరుపతి రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ చిట్టిబాబు ప్రచారం చేయడం ప్రారంభఇంచాడు. మద్యం తాగి వచ్చి గొవడపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో పార్వతమ్మ శనివారం కూలీ పనుల కోసం వెళ్లింది. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో భర్త చనిపోయి ఉండటంతో పార్వతమ్మ..సమీపంలోనే ఉన్న సోదరుడు తిరుపతి రావు ఇంటికెళ్లి వదినకు చెప్పింది. చిట్టిబాబు దుష్ప్రచారాన్ని తట్టుకోలేక అతనిని చంపేశానని చెప్పి తిరుపతి రావు గ్రామం వదిలి వెళ్లాడని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. హైవేపై దొంగతనం జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపు గట్టు దగ్గర ఒక కారు పై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సు పై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది