Tuesday 2 December 2014

రోగులపై అత్యాచారం .. కేన్సర్ వైద్యుడికి 22 యేళ్ల జైలు!

తన వద్దకు వైద్యం కోసం వచ్చిన రోగులను (యువతులు) లైంగికంగా వేధించిన కేసులో కేన్సర్ వైద్య నిపుణుడికి బ్రిటన్ కోర్టు 22 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. మొత్తం 18మంది బాలికలను లైంగికంగా వేధించినట్టు కోర్టు వెల్లడించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే.. 
 
మైల్స్ బ్రాడ్‌బరీ అనే ఆ వైద్యుడు కేంబ్రిడ్జిలోని అడెన్‌బ్రూక్ ఆస్పత్రిలో రక్త కేన్సర్ నిపుణుడిగా పని చేసేవాడు. ఈయన వద్దకు వచ్చే రోగులను లైంగికంగా వేధిస్తూ.. వారిని లోబరచుకుని అత్యాచారం చేసేవాడు. ఈ విధంగా గత 2009లో 25 ఆరోపణలు వచ్చాయి. 13 ఏళ్ల వయసున్న బాలికపై కూడా అత్యాచానికి పాల్పడినట్టు సమాచారం. అత్యాచారం చేయడమే కాకుండా, తన కామకృత్యాలను వీడియోలు కూడా తీసేవాడు. 
 
దీనిపై కొందరు రోగులు ఫిర్యాదు చేయడంతో అతని లీలలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా 2013లో బ్రాడ్‌బరీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య సహాయం కోసం వచ్చిన 18 మంది యువతుల పట్ల మైల్స్ బ్రాడ్ అత్యంత క్రూరంగా వ్యవహరించాడని, వాళ్ళు అతడ్ని ఎంతగానో నమ్మి వస్తే వారిపట్ల అసభ్యంగా ప్రవర్థించాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది మిచెల్ బ్రౌన్ అన్నారు. 
 
ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇలాంటి కేసు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. అత్యంత తీవ్రమైన వ్యాధులతో బాధపడేవాళ్లను కూడా అతడు వదల్లేదని, అతడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించడం భావ్యమేనని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment