Tuesday 28 October 2014

నాగ్‌తో రొమాన్స్‌కు తమన్నా ఓకే: కార్తీ వున్నాడుగా అందుకేనా


నాగార్జున- కార్తీల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించనున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే, ఈ సినిమాలో ఒకే హీరోయిన్ ఉంటుందని సమాచారం. 
 
నాగార్జున, కార్తీలు ఈ చిత్రంలో ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్నారని.. ఈ ఛాన్స్‌ను మిల్కీ బ్యూటీ తమన్నా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమన్నా కార్తీతో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. తమిళంలో రూపొందిన 'పయ్యా'(తెలుగులో ఆవారా), 'సిరుత్తై'(తెలుగు విక్రమార్కుడికి రీమేక్) చిత్రాల్లో వీరిద్దరు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక నాగార్జునతో తొలిసారి తమన్నా రొమాన్స్ చేయనుంది. దీంతో ఇన్నాళ్ళు తమన్నాతో రొమాన్స్ చేయాలని కలగన్న నాగ్ ఆశ నెరవేరనుంది. 
 
గతంలో తమన్నాతో సినిమా చేయాలని నాగార్జున ఉవ్విళ్లూరాడని వార్తలొచ్చాయి. అయితే తమన్నా నాగ్ సీనియర్ కావడంతో అంగీకరించలేదని.. ప్రస్తుతం మల్టీస్టారర్ కావడంతో నాగ్‌తో జతకట్టేందుకు మిల్కీ బ్యూటీ ఓకే చెప్పేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకా యంగ్ హీరో కార్తీ ఉన్నాడనే ధైర్యంతోనే నాగ్‌తో చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోం

బక్క హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయనున్న త్రిష!


బక్క హీరో ధనుష్‌తో సినిమా చేయలేదనే టాక్ రావడంతో త్రిష ఆ హీరోతో నటించాల్సిందేనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ధనుష్-త్రిష ఈ మధ్య తెగ క్లోజ్‌గా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇవి నిజం చేసేటట్లు ధనుష్ చిత్రంలో నటించే ఆఫర్‌ను త్రిష కొట్టేసింది. ఈ ఛాన్స్‌ కోసం త్రిష పేరును ధనుష్ రెకమెండ్ చేశాడట. 
 
గతంలో ధనుష్ నటించిన 'ఆడుగళం' సినిమా కోసం త్రిషను తీసుకున్నప్పటికీ మొదట్లోనే ఆమెను డ్రాప్ చేశారు. ఈ నేపథ్యంలో త్రిష ఇప్పుడు ధనుష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుందనే వార్త కోలీవుడ్‌లో ప్రచారంలో వుంది. 
 
ఇటీవల ధనుష్‌తో 'వేలై ఇల్లా పట్టదారి" చిత్రాన్ని రూపొందించిన వేల్ రాజ్ మళ్లీ ధనుష్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో త్రిషను కథానాయికగా తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ రికమండేషన్ కారణంగానే ఈ చెన్నై ముద్దుగుమ్మకి ఆఫర్ వచ్చినట్లు సమాచా
రం

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు

ఖైదీ భార్యను వేధిస్తున్న వార్డర్.. కేసు నమోదు
హైదరాబాద్: మహిళల పట్ల వేధింపులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. చర్లపల్లి జైలు వార్డర్ తన భార్యకు తరుచు ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం రాములు అనే ఖైదీ చర్లపల్లి జైళ్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని చూసేందుకు అతడి భార్య తరుచూ జైలుకు వచ్చేది. ఆ క్రమంలో జైలు వార్డర్ వెంకన్న ఆమె నుంచి సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ రాములు భార్యకు ఫోన్ చేసి వేధించేవాడని తెలిపారు. వార్డర్ వేధిస్తున్న విషయాన్ని తన భర్త రాములుకు తెలిపింది అతని భార్య. దీంతో రంగంలోకి దిగిన రాములు జైలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించక పోగా.. రాములు భార్యపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఆ విషయాన్ని రాములకు వెల్లడించగా.. రాములు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అయ్యాయి

'ధూమ్' సినిమా తరహాలో సొరంగం తవ్వి బ్యాంకులో దోపిడీ



హర్యానా రాష్ట్రంలో 'ధూమ్' అనే బాలీవుడ్ చిత్రం తరహాలో ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇందుకోసం దొంగలు ఏకంగా 125 అడుగుల మేర సొరంగం తవ్వడం గమనార్హం. హర్యానాలోని గోహనా టౌన్‌షిప్‌లో సొరంగం తవ్వి ఓ బ్యాంకు స్ట్రాంగ్ రూంకు చేరుకొని డబ్బులు, కోట్లాది రూపాయల నగలు, బంగారం దోచుకున్నారు. దోపీడిని సోమవారం ఉదయం గుర్తించారు. సొరంగం తవ్వి, స్ట్రాంగ్ రూంకు వచ్చినందున.. ఈ దోపిడీ శనివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం మధ్యన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 
 
chandigarh mapసదరు దొంగలు స్ట్రాంగ్ రూంలో ఉన్న 360 లాకర్లలోని 90 లాకర్లను దోచుకెళ్లారని బ్యాంకు మేనేజర్ చెప్పారు. పోలీసులు బ్యాంకులోని రెండు గదుల్లో సొరంగం తాలుకు మట్టిని గుర్తించారు. దొంగలు లోనికి వచ్చి అన్ని కిటికీలు మూసేశారు. దీంతో వారు బయటకు కనిపించకుండా పోయారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని గొహానా డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు సోమవారం చెప్పారు. బ్యాంకు లోపల పలు సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, స్ట్రాంగ్ రూంలో మాత్రం ఎలాంటి కెమెరాలు లేవని చెప్పారు.

Tuesday 21 October 2014

మీరట్‌లో దారుణం: ప్రేయసిపై ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

gang rape
మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేయసిని మాయమాటలతో నమ్మించి ఓ దుర్మార్గుడు తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. భవాన్ పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలితో ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి ఆమెను ప్రేమలోకి దింపాడు. ఈ విషయం ఆమెకు తెలిసింది. దీంతో అతడిని నిలదీసింది. ఈ నెల 18వ తేదీన రెస్టారెంటుకు రావాలని ఆమెకు అతను ఫోన్ చేశాడు. అక్కడ అతని సోదరుడు, మరో స్నేహితుడు ఉన్నాడు. ఆమెను మాటల్లోకి దించి ఓ ప్రాంతానికి తీసుకు వచ్చారు.
 
తర్వాత మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వారు వీడియో తీశారు. తమ గురించి ఎవరికైనా చెబితే వీడియోను ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు

ఐఎస్ఐఎస్‌ మరో ఘాతుకం.. వ్యభిచారం చేసిందని తండ్రి రాళ్లతో

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు మరో ఘాతుకానికి పాల్పడింది. మధ్య సిరియాలోని హమా ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ వ్యభిచారం చేసిందంటూ ఆమెను ఐఎస్ఐఎస్ గ్రూపు రాళ్లతో కొట్టి చంపేశారు. అంతేగాకుండా ఆ వీడియోను ఆన్ లైన్‌లో పోస్టు చేశారు.
 
ఈ వీడియో తొలి ఐదు నిమిషాల్లో సదరు మహిళ తన తండ్రితో కలిసి కనిపిస్తుంది. వారి పక్కనే ఓ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ కూడా కనిపిస్తాడు. ఆమె తన తండ్రిని క్షమించమని అడిగినా, అతడు నిరాకరించినట్టు వీడియోలో వెల్లడైంది. 
 
క్షమిస్తే ఆమె స్వర్గానికి చేరుకుంటుందని, క్షమించాలని మిలిటెంట్ చెప్పినా, ఆమె తండ్రి నిరాకరించాడు. అంతేగాకుండా, ఆ కిరాతక తండ్రే రాళ్ళను పోగు చేశాడు. ఆ రాళ్ళతోనే ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఆమెను చనిపోయేదాకా కొట్టారు. 

టీడీపీ ఎమ్మెల్యే పేరిట పరీక్ష రాస్తూ కెమెరాకు చిక్కాడు

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సింగ్‌పూర్‌లో ఉండగా సోమవారం నాడు ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ చెబుతున్నారు. గుట్టురట్టు కావటంతో ఆయన గైర్హాజరైనట్లు చూపుతున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వన్ సిట్టింగ్‌లో ఇంటర్ కోర్సు పూర్తి చేసేందుకు ప్రసాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కోర్సుకు గంగూరులోని ఓ మహిళా కళాశాల ద్వారా ఇటీవల పరీక్ష ఫీజు చెల్లించారు. సెప్టెంబర్ 27న ప్రారంభమై నవంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు పెనమలూరు మండలం పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవిఎస్ జూనియర్ కళాశాలను కేంద్రంగా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పరీక్షలు జరిగాయి. ప్రసాద్ హాల్ టిక్కెట్ నెంబర్‌తో రెండు పరీక్షలకు హాజరైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తోందంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన సింగ్‌పూర్ వెళ్లారు. సోమవారం నాలుగో పరీక్షకు ఓ యువకుడు హాజరై ప్రసాద్ పేరిట ఆన్సర్ షీటుపై సంతకం కూడా చేసినట్లు కొందరు అభ్యర్థులు సెల్‌ఫోన్ ద్వారా తీసిన ఫొటో ద్వారా తెలుస్తోందని చెబుతున్నారు. అయితే ఈ రహస్యం బైటకు పొక్కటంతో పరీక్ష రాసినట్లుగా భావిస్తున్న యువకుడు అదృశ్యమయ్యాడు. మరోవైపు, పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరైనట్లు పరీక్ష ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నమోదు చేశామని చెబుతున్నారు. సోమవారం పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 408 మంది హాజరయ్యారు. ప్రసాద్ రాయాల్సిన పరీక్షను ఆయన పేరుతో మరొకరు రాసిన సంఘటనపై విచారణ జరిపించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. బోడె ప్రసాద్‌కు ఇంటర్మీడియట్ పరీక్షలు ఇబ్బంది తెచ్చిపెట్టాయని అంటున్నారు. సోమవారం భౌతిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. కేంద్రంలో ఉన్న కొందరు అభ్యర్థులు ఎమ్మెల్యే స్థానంలో గుర్తు తెలియని యువకుడు పరీక్ష రాస్తున్నాడంటూ ఆ యువకుడి ఫోటోలు, సమాధాన పత్రాలను సెల్‌ఫోన్లో వాట్సప్, ఎస్సెమ్మెస్ ద్వారా బయటకు చేరవేశారు. విషయం తెలియడంతో మీడియా ప్రతినిధులు పరీక్ష కేంద్రానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వీరిని పరీక్ష కేంద్రంలోకి తొలుత నిరాకరించినా, తర్వాత వెళ్లనిచ్చారు. అయితే, అప్పటికి ఎమ్మెల్యేకు కేటాయించిన స్థానం ఖాళీగా కనిపించింది. అప్పటికే అక్కడకు చేరుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ప్రసాద్ పేరుతో ఉన్న సమాధాన పత్రం ఫోటోను అధికారులకు చూపించారు. ఫోటోలను పరిగణించబోమని నిజపత్రాలనే ప్రమాణంగా తీసుకుంటామని అధికారులు చెప్పారు. ప్రసాద్ పరీక్షలకు హాజరు కాలేదని వారు చెప్పారు. సింగపూర్లో ఉండటంతో సోమవారం నాటి పరీక్షకు తాను హాజరు కాలేదని, దీనిని గమనించిన ప్రత్యర్థులు తన పైన కుట్ర పన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని బోడె ప్రసాద్ అన్నారు.

ఆ ఛానెళ్ళని జనం అడగటం లేదట

దాదాపు నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారం జరగడం లేదు. ఈ విషయంలో జర్నలిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ , ‘‘ప్రజలు ఆ రెండు ఛానెళ్ళని ప్రసారాలను ప్రసారం చేయాలని కోరడం లేదు. అందుకే ప్రసారం చేయడం లేదు. ఆ రెండు ఛానెళ్ళ ప్రసారాలను నిలిపివేయడంలో ప్రభుత్వ పాత్ర, ఎంఎస్‌ఓల పాత్ర ఏమీ లేదు. న్యాయస్థానాలు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి. మాతో వ్యాపార ఒప్పందాలు కొనసాగించే ఆలోచన ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదు’’ అన్నారు

ఆళ్లగడ్డ ఏకపక్షమే: టిడిపి, కాంగ్రెస్ పోటీకి దూరం

హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి అక్టోబర్ నెలలో జరగాల్సిన ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు సోమవారం ప్రకటించాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీఅభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అయితే విజయలక్ష్మి పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. చిన్నాచితకా పార్టీలు పోటీచేస్తామని ప్రకటించడంతో పోటీ చేయవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో వారు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కాగా ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుంది. పోటీలో ఎవరూ లేకపోతే అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విన్నపానికి స్పందించని వారు ఎవరైనా నామినేషన్ వేసినా ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం లేదని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. నంద్యాల ఎమ్మెల్యే, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆనవాయితీలను పాటిస్తూ పోటీ నుంచి తప్పుకోవడం హర్షనీయమని వారు పేర్కొన్నారు. కాగా, కాగా, ఆళ్లగడ్డకు నవంబర్ 8న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 12న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Monday 20 October 2014

ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయదు: కృష్ణమూర్తి

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు జరుగనున్న ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమను కలిసి ఆళ్లగడ్డలో పోటీ చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు. మైసూరారెడ్డి, తదితరులు తమను కలిశారని ఆయన చెప్పారు. ఇది ఇలా ఉండగా అంతకుముందు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశారు. ఆళ్లగడ్డలో పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తామని ఆయనకు చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖత చూపలేదు. కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ చనిపోయినప్పుడు ఆ స్థానంలో వారి కుటుంబీకులు పోటీ చేస్తే ఇతర పార్టీ తమ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టకుండా చూడటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో పాత సంప్రదాయాలు పాటించాలని పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు సర్ది చెప్పారు. గత మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పుడు జరిగిన ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికల్లో శోభానాగిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ పమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ గత శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో బ్లాస్ట్: 13 మంది సజీవ దహనం

తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం ఈ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. రెండు అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయి. బాణసంచా అనధికారికంగా తయారు చేస్తుండగా ఈ విస్ఫోటనం సంభవించింది. 
 
మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. సంఘటన ప్రాంతం వద్ద, ఆసుపత్రి వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పేలుడు ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. 

తల్లిదండ్రులను చంపేసి 72 రోజులు ఇంట్లోనే ఉంచేసిన బాలిక

murder
16 సంవత్సరాల బాలిక తన 22 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తో కలిసి దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చంపిన ఘటన వడోదరాలో చోటు చేసుకుంది.
ఇంటి నుండి చెడు వాసన రావడంతో ఇంటి చుట్టుపక్కల వారు పోలిసులకు సమాచారం అందించారు.పోలీసులు బలవంతంగా తలుపులు తెరచి చూస్తే అందులో రెండు శవాలు కనిపించాయి.
అమ్మాయి మీద అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.హత్య చేసింది తానే అని ఒప్పుకుంది.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ హత్య చేసినట్టు జాయింట్ పోలీస్ కమీషనర్ డీజే పాటిల్ తెలిపారు.హత్య అనంతరం ఆ బాలిక బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ వచ్చి శవాల మీద అప్పుడప్పుడు సెంట్ చల్లి వేలుతుండేవాడు.ఈ హత్య ఆగష్టు 3న జరిగినట్టు,72 రోజుల పాటు శవాలను ఇంట్లోనే ఉంచారని పోలీసుల విచారణలో తెలిసింది.
ఎప్పుడూ తల్లిదండ్రులు కొట్టేవారని,నాకు ఇష్టం లేకున్నా చదువుకోమని బలవంతం చేసే వారని అందుకే చంపేశానని పోలీసులకు వివరించింది ఆ బాలిక.ప్రస్తుతానికి ఆ బాలిక ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి అభ్యసిస్తుంది.
పోలిసుల సమాచారం ప్రకారం వడోదరా నగరంలోని మంజల్ పూర్ ప్రాంతంలో ఉన్న తిరుపతి సొసైటీ వద్ద 63 సంవత్సరాల శ్రీహరీ వినోద్ మరియు 60 సంవత్సరాల అతని భార్య స్నేహ నివాసముంటున్నారు.వీరికి సంతానం లేకపోవడంతో 15 సంవత్సరాల క్రితం సంవత్సరం వయసున్న ఆ బాలికను దత్తత తీసుకున్నారు

జయలలితకు రజనీకాంత్ లేఖ.. బీజేపీ షాక్

అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, శనివారం జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. ఇది బీజేపీ నేతలను షాక్‌కు గురిచేసింది. రజనీని తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు ఆయన హఠాత్తుగా జయకు లేఖ రాయడం బీజేపీకి రుచించలేదని అంటున్నారు. రజనీతో పాటు కేంద్రమంత్రి మేనకా కాంధీ కూడా జయకు శుభాకాంక్షలు తెలియ చేయడం పార్టీలో చర్చించుకుంటున్నారని చెబుతున్నారు.
 
అయితే, రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పడంపై కోలీవుడ్‌లో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ, బీజేపీ గెలిచినప్పుడు వారికి అభినందనలు తెలిపారని, ఇప్పుడు జయలలిత జైలు నుంచి విడుదలైనప్పుడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారని ఇందులో కొత్తగా చర్చించుకోవాల్సిందేమీ లేదన్నారు. 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు జివో నెం21ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఈ ఏడాది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వ పరిధిలో రాయనున్నారు.

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

సికిందరాబాద్: పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలులో పాట్నీ కారు కింద ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సాంకేతిక లోపం వల్లే మంటలు వ్యాపించాయని, సకాలంలో వాటిని అదుపు చేయడంతో ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ

సచిన్ రికార్డును బద్దలకొట్టిన కోహ్లీ!
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు(51) సాధించిన బ్యాట్స్ మెన్ గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే సచిన్ టెస్టు రికార్డుకు పెద్దగా ముప్పులేకపోయినా.. వన్డే రికార్డుపై అనేక సందేహాలు తలెత్తున్నాయి. సచిన్ వన్డే రికార్డును అధిగమించే క్రమంలో మరో భారత్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలి అడుగు వేశాడు.

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ, టెండూల్కర్ రికార్డుల ఛేదనలో తొలి విజయం సాధించాడు. ఆ మ్యాచ్‌లో 127 పరుగులు చేసిన విరాట్, తన కెరీర్‌లో 20 సెంచరీలను పూర్తి చేశాడు.  కేవలం 64 ఇన్నింగ్స్‌లోనే 20 సెంచరీలు చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను చేరిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే కెరీర్‌లో మొత్తం 49 సెంచరీలు చేసిన సచిన్, తొలి 20 సెంచరీలు చేసేందుకు 197 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. దీంతో కోహ్లీ సచిన్ పేరిట ఉన్న 20 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. అతి తక్కువ సమయంలోనే సచిన్ రికార్దుపై పైచేయి సాధించిన కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక రికార్డులు నమోదు చేస్తాడా?లేదా అనేది వేచి చూడాల్సిందే

మళ్లీ పి.టి. ఉష పరుగులు: గుజరాత్ విద్యార్థులకు ట్రైనింగ్

ptushaనాటి పరుగుల రాణి పీటీ ఉష గుజరాత్ లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు సమ్మతించినట్లు తెలిసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీ కోరిక మేరకే గుజరాత్ లో కొంతమంది బాలలను వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష అంగీకరించినట్లు తెలుస్తోంది.
 
అక్కడ 10 - 11 ఏళ్ల వయసున్న 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చి. ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. సియోల్ ఒలింపిక్స్ లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష రెపరెపలాడించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. 

కాశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేస్తాం : బిలావల్ భుట్టో

కాశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి తీరుతామని పాక్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో కొడుకు, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) యువ నేత బిలావల్‌ భుట్టో ప్రకటించారు. ఆరు నూరైనా భారత్‌ నుంచి కాశ్మీర్‌ను సాధించి తీరతానని మహ్మద్‌ ఆలీ జిన్నా సమాధి దగ్గర జరిగిన ఒక ర్యాలీలో శపథం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినపుడల్లా భారతదేశమంతా గగ్గోలు పెడుతుంది. ఒక భుట్టో మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలో వారికి తెలియదు. అందుకే ఆ గగ్గోలు’ అని వ్యాఖ్యానించారు. 
 
కాశ్మీర్‌పై తన వ్యాఖ్యలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. కాశ్మీర్‌ ముమ్మాటికీ పాకిస్థాన్‌లో భాగమవుతుందంటూనే కాశ్మీర్‌ పేరుతో భారత్ - పాక్‌ చర్చలను బందీగా చేసేందుకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 

వేధించిన భర్తని చంపేసిన భార్య

కట్టుకున్న భర్త వేధింపులను ఒక దశ వరకూ భరించిన భార్య ఇక భరించలేక అతనిని హతమార్చింది. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దస్తగిరి, చిట్టెమ్మ అనే భార్యాభర్తలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అయితే దస్తగిరి ఎంతోకాలంగా భార్యమీద అనుమానంతో వేధిస్తున్నాడు. దీని మీద ఇద్దరి మధ్య ప్రతిరోజూ ఇద్దరూ గొడవపడేవారు. భర్త వేధింపులు బాగా మితిమీరడంతో చిట్టెమ్మ నిద్రిస్తున్న ఆదివారం అర్థరాత్రి దస్తగిరి తలపై రాయితో మోది హత్య చేసింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రైతులే లేకపోతే మనం లేం.. రుణమాఫీ చేస్తే తప్పేంటి?: హైకోర్టు

రుణాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రుణమాఫీ ఎందుకంటూ పిటిషన్ వేస్తారా? అంటూ పిటిషనర్‌పై హైకోర్టు ఫైర్ అయ్యింది. భవిష్యత్తులో ఇలా ప్రజల ప్రయోజనాలను కాలరాసే పిటిషన్లు వేస్తే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 
 
రైతు రుణమాఫీపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులే లేకపోతే మనం లేమన్న విషయం గుర్తుంచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే, సమగ్ర సర్వేపై విచారించిన హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Sunday 19 October 2014

మహారాష్ట్రలో ఎంఐఎం బోణీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీ రెండు స్థానాలను గెలిచి సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీకే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా బోణీ కొట్టింది. ఔరంగాబాద్ సెంట్రల్ నుంచి జర్నలిస్టు సయ్యద్ ఇంతియాజ్ జలీల్, ముంబై నగరంలోని బైకలా నియోజకవర్గం నుంచి న్యాయవాది వారిస్ యూసుఫ్ పఠాన్‌లు ఎంఐఎం పార్టీ తరఫున విజయం సాధించారు. ఇంతియాజ్ శివసేన అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్‌ను 20 వేల ఓట్ల తేడాతో, వారిస్ బీజేపీ అభ్యర్థి మధుకర్ చవాన్‌ను 1,357 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎంఐఎం మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసింది.

Saturday 18 October 2014

అతుల్ శర్మతో మాజీ భార్య లింకట: కూతురికి, పేస్‌కు బెదిరింపులు!

తనను, తన కూతురుని చంపుతానని క్రికెటర్ అతుల్ శర్మ బెదిరించినట్లు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతుల్ శర్మతో తన మాజీ భార్య రియా పిళ్లైకి సంబంధాలున్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలను ఆయన కోర్టుకు సమర్పించారు.
 
బాంద్రా కోర్టు కాంప్లెక్స్‌లో తనను, తన కూతురుని చంపుతానని అతుల్ శర్మ బెదిరించినట్లు పేస్ తెలిపారు. లియాండర్ పేస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 10వ తేదీన అతుల్ శర్మ తనను బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేస్ తెలిపారు.
 
ఇక అతుల్ శర్మపై కేసు నమోదు చేశామని, అరెస్టు మాత్రం చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఆఫీసర్ కెవి నిగాడే చెప్పారు. కాగా.. పేస్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రియా పిళ్లై కేసు పెట్టారు.

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి: నల్లగొండ యాక్సిడెంట్‌లో..

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి చెందాడు. సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో హైదరాబాదు తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మరణించాడు.
 
పెద్దకాపర్తి శివారులోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని సాయిసంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
 
సలావుద్దీన్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ (సిమి) జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి.

తీరనున్న కష్టాలు: తెలంగాణకు వెయ్యి మెవా విద్యుత్

తీరనున్న కష్టాలు: తెలంగాణకు వెయ్యి మెవా విద్యుత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చేందుకు మార్గం సుగమమైంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా ఒప్పందం కుదిరితే తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ రానుంది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. నగరంలో 2గంటల నుంచి 4గంటలపాటు విద్యుత్ కోతను విధిస్తున్నారు. అది గ్రామాల్లో అయితే దాదాపు 6నుంచి 8గంటలవరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో 7నుంచి 8రూపాయల చొప్పున కరెంటు కొంటున్నా.. అది ఏమాత్రం సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలో గతంలో ఛత్తీస్‌గఢ్‌తో మొదలైన చర్చలను పునరుద్ధరించింది. కాగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా విద్యుత్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. అయితే ప్రస్తుతానికి విద్యుత్ సరఫరా లైన్ లేకపోవడం ఓ సమస్యగా మారింది. వీలైనంత త్వరగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుని, కారిడార్ నిర్మించుకోవడం, లేదా మరేదైనా మార్గం ద్వారా విద్యుత్తును తీసుకురావడం చేయాలని భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందితే తెలంగాణలో దాదాపు విద్యుత్ కష్టాలు తీరినట్లే అవుతుంది. గోదావరి పుష్కరాలపై కమిటీ ఏర్పాటు గోదావరి పుష్కరాలపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. సభ్యులుగా నీటిపారుదల ఈఎస్‌సి, ఎస్ఆర్ఎస్‌సి చీఫ్ ఇంజినీర్, గోదావరి ఎత్తిపోతల చీఫ్ ఇంజినీర్, బేసిన్ కమిషనర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా చీఫ్ ఇంజినీర్లను నియమించింది.

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి: నల్లగొండ యాక్సిడెంట్‌లో..

సిమీ ఎక్స్ చీఫ్ సలావుద్దీన్ మృతి చెందాడు. సలావుద్దీన్ అహ్మద్ (45) కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. 
 
హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో హైదరాబాదు తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మరణించాడు.
 
పెద్దకాపర్తి శివారులోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని సాయిసంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.
 
సలావుద్దీన్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ (సిమి) జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి.

బరాక్ ఒబామా క్రెడిట్ కార్డు.. గోవిందా!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రెడిట్ కార్డు పనిచేయకుండా పోయింది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లిన ఒబామా అక్కడ ఏదో హోటల్‌కు వెళ్లాడు. క్రెడిట్ కార్డు వాడదామని చూస్తే.. ఆ కార్డు తిరస్కరణకు గురైంది. 
 
ఇలా ఎందుకు జరిగిందో ఒబామాకు కాసేపు అర్థం కాలేదు. తీరా చూస్తే ఆయన క్రెడిట్ కార్డును ఎవరో క్లోన్ చేసి వాడేశారని తెలిసి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఆయన కన్స్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరోలో చెప్పారు. 
 
తాను పెద్దగా వాడకపోయినా అప్పుడే లిమిట్ ఎలా అయిపోయిందా అనుకున్నానని, అప్పుడు తనకు ఏదో మోసం జరిగినట్లు అర్థమైందని చెప్పారు. లక్కీగా మిషెల్ కార్డు మాత్రం బాగానే ఉందని ఒబామా నవ్వతూ  తెలిపా

త్రివిధ దళాలు రెడీగా ఉండండి.. డిజిటల్ సైన్యాన్ని చూడాలని వుంది

శత్రువులు కనిపించకపోయినా, ముప్పు పొంచి వుంటుందని, అందుకే అన్ని విధాలుగా త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ అని మోడీ తెలిపారు. 
 
సైనికబలగాల ఉన్నతస్థాయి కమాండర్ల సంయుక్త వార్షిక సదస్సు భేటీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దాక్కుని పోరాడే శత్రువును ఎదుర్కొనేందుకు ప్రతిఘటనా శక్తిని పెంచుకోవాలని సూచించారు. అలా చేస్తే శత్రువు వైఖరిలో మార్పు వస్తుందని ఆయన సూచించారు. 
 
రోజురోజుకీ మారుతున్న ప్రాధామ్యాల నేపథ్యంలో భద్రతా సవాళ్లనుముందుగా పసిగట్టడం సాధ్యం కావడం లేదని పేర్కొన్న ఆయన, దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే భద్రత, శాంతియుత వాతావరణం అవసరమని అన్నారు. తన ప్రభుత్వ ప్రథమ లక్ష్యాల్లో దేశ భద్రత అగ్రభాగాన ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
భారత బలగాల ఆధునికీకరణ, రక్షణ పరికరాలు సమకూర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ సైన్యాన్ని చూడాలనుకుంటున్నానని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత బలగాల శక్తిసామర్థ్యాలు గొప్పవని శ్లాఘించిన ఆయన, సైనికులకు ‘ఒక ర్యాంకు-ఒక పింఛను’ వంటి హామీలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

Friday 17 October 2014

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి అజ్ఞాతంలోకి

గుంటూరు: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎమ్మెల్యే సెల్ ఫోన్ గత రెండు రోజులుగా పనిచేయడం లేదు. వ్యక్తిగత సిబ్బందికి తెలియకుండానే ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లారు. చెన్నాయపాలెం సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీ భూమల వివాదంలో పిన్నెల్లి ఏ-2 నిందితుడు. ఏ-1 నిందితుడిగా ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు. అయితే వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం చేసుకున్నారు. దీంతో రామకృష్ణరెడ్డి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ లభించక పోవడంతో ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు.

జూడాలు మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలి: మంత్రి రాజయ్య

వరంగల్ : జూనియర్ డాక్టర్లు మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని తెలంగాణ వైద్య శాఖ మంత్రి రాజయ్య కోరారు. శనివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు జూడాలను చర్చలకు ఆహ్వానిస్తున్నామని మంత్రి రాజయ్య చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా డెంగీ మరణాలు లేవని, డేంగీ కేసులపై పరిశీలనకు జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నేడే జయ విడుదల

కర్నాటక : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో జయలలితకు షరతులతో కూడిన మధ్యంతర బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. దీంతో జయ శనివారం జైలు నుంచి విడుదల కానుంది.  కోర్టు నిర్ణయంతో  సెప్టెంబర్ 27 నుంచి గత 20 రోజులుగా బెంగుళూరులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయకు గొప్ప ఊరట లభించింది. అయితే బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల శిక్ష నిలుపుదలే కానీ రద్దు కాదని కోర్టు స్పష్టం పేర్కొది. శిక్షపై రెండు నెలల స్టే విధించింది.  సమగ్ర వివరాలు పత్రాలతో అప్పీలుకు సుప్రీంకోర్టు రెండు నెలల గడువు ఇచ్చింది. 35 వేల రూపాయల పూచికత్తుపై 18 డిసెంబర్ లోగా ఆమె కోర్టుకు దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు నెలలకన్నా ఒక్కరోజు కూడా సమయం ఇవ్వమని సుప్రీం స్పష్టం చేసింది. జయతో పాటు ఆమె సమీప బంధువులు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా కోర్టు బెయిల్ మంజూరైంది.
బెయిల్ దక్కినా విడుదలకు ఆటంకం..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసినా వెంటనే విడుదలకు వీలు కాలేదు. షరతులతో కూడిన జామీను ప్రతి సకాలంలో బెంగళూరులోని సంబంధిత అధికారులకు చేరలేదు. శనివారం ఈ ఉత్వర్వులను అందచేశాక ఆమె జైలు నుండి విడుదల కానున్నారు. 
రెండు నెలలు జయ ఇంట్లోనే..
జైలు నుంచి విడుదలైన తరువాత రెండు నెలల పాటు జయ ఇంట్లోనో ఉండాలని కోర్టు షరతు విధించింది. తమిళనాడులో హింసాత్మక ఘటనలు జరక్కుండా కార్యకర్తలను అదుపులో ఉండేలా చూడాలని కోర్టు ఆదేశించింది. దీంతో తాను ఇంటికే పరిమితమవుతానని కోర్టుకు జయ హామీ ఇచ్చారు. తమిళనాడులో హింసాత్మక ఘటనలు జరగకుండా చూస్తామని జయలలిత తరపున వాదించిన నారిమన్ కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. 
జయలలితకు షరతులతో కూడిన బెయిలు..
ఇదిలా ఉంటే జయలలితకు షరతులతో కూడిన బెయిలు మాత్రమే మంజూరైందని  బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. డిసెంబర్ 18 వరకు ఆమె అప్పీలు పత్రాలు సమర్పించకపోయినా ...తమిళనాడులో  శాంతి భద్రతలకు విఘాతం కలిగినా బెయిలు రద్దయ్యే అవకాశముందని సుబ్రహ్మణ్యస్వామి చెప్పాడు. సుబ్రహ్మణ్యస్వామి అక్రమ ఆస్తులకు సంబంధించి జయపై కేసు వేసిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే సంబురాలు..
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో బెంగుళూరు ప్రత్యేక కోర్టు జయను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. బెంగుళూరు హైకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్ రద్దు కాగా జయ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయకు బెయిలు మంజూరు కావడంతో తమిళనాడులో అన్నాడిఎంకే కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

రైలు కింద పడి తల్లికూతుళ్ల మృతి

వరంగల్ : రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. చిన్నారులతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం కలిచివేస్తోంది. నిన్న ఘట్ కేసర్ శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో తల్లి ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ శివారులోని తల్లి, ఇద్దరు కూతుళ్లతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియరాలేదు. 

భారత్‌దే వన్డే సిరీస్

భారత్‌దే వన్డే సిరీస్
ధర్మశాల: నాటకీయ పరిణామాల మధ్య అర్ధంతరంగా ముగిసిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లి (114 బంతుల్లో 127; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ధోనిసేన 59 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 330 పరుగులు చేసింది. విరాట్‌కు తోడుగా రైనా (58 బంతుల్లో 71; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), రహానే (79 బంతుల్లో 68; 7 ఫోర్లు) దూకుడుగా ఆడారు. విరాట్ 8 నెలల తర్వాత శతకం చేశాడు.

 అనంతరం విండీస్ 48.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. శామ్యూల్స్ (106 బంతుల్లో 112; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేశాడు. డారెన్ బ్రేవో (51 బంతుల్లో 40; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపిస్తే, రస్సెల్ (23 బంతుల్లో 46; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు.

 స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రహానే ఎల్బీడబ్ల్యు (బి) బెన్ 68; ధావన్ (సి) డారెన్ బ్రేవో (బి) రస్సెల్ 35; కోహ్లి రనౌట్ 127; రైనా (సి) రామ్‌దిన్ (బి) టేలర్ 71; ధోని రనౌట్ 6; జడేజా (సి) రస్సెల్ (బి) హోల్డర్ 2; రాయుడు నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (50 ఓవర్లలో 6 వికెట్లకు) 330.
 వికెట్ల పతనం: 1-70; 2-142; 3-280; 4-290; 5-300; 6-330
 బౌలింగ్: టేలర్ 9-0-77-1; హోల్డర్ 9-0-52-1; రస్సెల్ 7-0-48-1; బెన్ 8-0-30-1; శామ్యూల్స్ 10-0-54-0; డ్వేన్ బ్రేవో 6-0-51-1; పొలార్డ్ 1-0-12-0.

 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) షమీ (బి) ఉమేశ్ 0; డారెన్ బ్రేవో (బి) అక్షర్ 40; పొలార్డ్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 6; శామ్యూల్స్ (బి) షమీ 112; రామ్‌దిన్ (సి) అక్షర్ (బి) జడేజా 9; డ్వేన్ బ్రేవో ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 0; స్యామీ (సి) అండ్ (బి) అక్షర్ 16; రస్సెల్ (బి) ఉమేశ్ 46; హోల్డర్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 11; టేలర్ (బి) షమీ 11; బెన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: (48.1 ఓవర్లలో ఆలౌట్) 271.
 వికెట్ల పతనం: 1-1; 2-27; 3-83; 4-120; 5-121; 6-165; 7-222; 8-239; 9-260; 10-271
 బౌలింగ్: భువనేశ్వర్ 10-2-25-2; ఉమేశ్ 9-0-44-2; షమీ 9.1-0-72-2; కోహ్లి 1-0-14-0; అక్షర్ పటేల్ 10-1-26-2; జడేజా 9-1-80-2.

నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్, అక్టోబర్ 17: ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నిర్భయ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్‌ను రూపొందించారు. ఈ క్షిపణి 850 కిలోమీటర్ల లక్ష్యాన్ని అవలీలంగా ఛేదించగలదు. శుక్రవారం ఉదయం 10.04 గంటలకు నిర్భయ క్షిపణిని డెఫెన్స్ రీసెర్జి అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఓ) విజయవంతంగా పరీక్షించింది. క్షిపణుల దాడిని తప్పించుకుని లక్ష్యాన్ని చేరుకోవడం నిర్భయ్ ప్రత్యేకత అని డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలు ప్రకటించారు. చాందీపూర్ వేదిక నుంని 2013 మార్చి 12న మొట్టమొదటి సారి ఇలాంటి ఈ తరహా క్షిపణినే పరీక్షించారు. అయితే అనుకోని అవాంతరాల వల్ల అది మధ్యలోనే విఫలమైంది. ఇంతకు ముందు భారత్, రష్యా సంయుక్తంగా 290 కిలోమీటర్ల శ్రేణిగల సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్‌ను అభివృద్ధి చేసింది. అయితే దానికన్నా ఎక్కువ సామర్ధ్యంగల లాంగ్ రేంజ్ కేపబుల్ మిసైల్ నిర్భయ్‌ను ఎయిరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఎడిఇ), డిఫెన్స్ రీసెర్చి, డెవలప్‌మెంట్(డిఆర్‌డిఓ)ను రూపొందించాయి.

అచ్చం అమ్మలాగే


అచ్చం అమ్మలాగే. ..
ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.32 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం నిరాడంబరంగా ముగి సింది. భూమా కుటుంబం రాజకీయూల్లోకి వచ్చిన తర్వాత నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్ని అఖిలప్రియ కొనసాగించారు.

ముందుగా ఆమె పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్న నివాసగృహం నుంచి తండ్రి భూమా నాగిరెడ్డి, సోదరి మౌనికారెడ్డి, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డి, మహేశ్వరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కిశోర్‌రెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శోభా ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చే శారు. ఆ సమయంలో భూమా కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమయ్యూరు.

అనంతరం పట్టణంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయూల్లో అఖిల ప్రియ ప్రత్యేక పూజలు చేశారు. లింగమయ్య వీధిలోని పాత నివాసగృహానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత నామినేషన్ దాఖలు చేశారు. అఖిల ప్రియ సోదరి మౌనికారెడ్డి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

కార్యక్రమంలో  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్వీమోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, మణిగాంధీ, ఐజయ్య, జయరాం, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, భూమా నారాయణరెడ్డి, న్యాయవాది సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 అమ్మ ఆశయాలు నెరవేర్చడానికే...
 అమ్మ దివంగత శోభా నాగిరెడ్డి ఆశయాలు నెరవెర్చడానికే రాజకీయాల్లోకి వస్తున్నట్లు అఖిల ప్రియ తెలిపారు. నామినేషన్ వేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘అమ్మ లేని లోటు మా కుటుంబానికి, నియోజకవర్గానికి తీర్చలేనిది. ఆమె స్థానంలో పోటీ చేయాల్సి రావడం చాలా బాధాకరం. నన్ను అమ్మ ఆశీర్వాదం, నాన్న, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల బలమే నడిపిస్తుంది.  ఆళ్లగడ్డ ప్రజలు ‘మన అఖిల’ అని అనుకునేలా పనిచేస్తా.

ప్రజలందరూ మా  కుటుంబం వెంట నడుస్తారనే నమ్మకముంది. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగివున్నాను. అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలోని సమస్యలను డెయిరీలో రాసింది. వాటిని పరిష్కరించినప్పుడే అమ్మకు నిజమైన నివాళి. అప్పట్లో అమ్మ ఇచ్చిన హామీలను నెరవెర్చడమే నా ప్రథమ కర్తవ్యం. ఆమె మాదిరే పార్టీ శ్రేణులకు,ప్రజలకు అందుబాటులో ఉంటా’’నని అన్నారు. టీడీపీ పోటీపై విలేకరులు అఖిలను ప్రశ్నించగా... ‘నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతాదృక్పథంతో పోటీ పెట్టలేదు. ఇక్కడ కూడా టీడీపీ పోటీ పెట్టదని భావిస్తున్నాం. పార్టీ తరఫున వేసిన కమిటీ ఈ విషయంపై చర్చిస్తుంద’ని చెప్పారు.

 అఖిల ప్రజల మద్దతు సంపాదిస్తుంది..
  అఖిలప్రియ తప్పకుండా ప్రజల మద్దతు సంపాదిస్తుందనే విశ్వాసం ఉందని ఆమె తండ్రి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ‘దివంగత శోభా నాగిరెడ్డి తరహాలోనే అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందుతుంది. శోభాలాగానే నియోజకవర్గ ప్రజలకు ‘అమ్మ’ అరుు్య.. ఆమె స్థానాన్ని భర్తీ చేస్తుంద’ని విశ్వాసం వ్యక్తం చేశారు. మెజార్టీ ఎంత రావచ్చని అనుకుంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘దాని గురించి ఎప్పుడూ ఆలోచించము. ఎంత సేవ చేశామని మాత్రమే ఆలోచిస్తాం. అఖిల ప్రియ ప్రజా సమస్యలను  దగ్గర నుంచి చూసింది. కాబట్టి వాటిని తప్పక పరిష్కరిస్తుంద’ని అన్నారు.

చిన్నారి శ్రీజను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌

ఖమ్మం, అక్టోబర్‌ 17 : మృత్యువుతో పోరాడుతున్న ఓ చిన్నారి కోరికను నటుడు పవన్‌ కల్యాణ్‌ తీర్చారు. శుక్రవారం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజను పవన్‌ పరామర్శించారు. అపస్మారకస్థితిలో ఉన్న శ్రీజను చూసి పవన్‌ చలించిపోయారు. శ్రీజ కోలుకున్న తర్వాత హైదరాబాద్‌ తీసుకురావాలని బాలిక తల్లిదండ్రులను కోరారు. శ్రీజ కుటుంబానికి పవన్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. రాజమండ్రిలో కొన్న బొమ్మలను పవన్‌ చిన్నారి శ్రీజకు అందజేశారు.
 
ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ అనే బాలిక తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యం కోసం బాలికను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంచడంతో తాము ఏమీ చేయలేమని వైద్యులు తేల్చిచెప్పారు. అయితే తనకు పవన్‌ కల్యాణ్‌ను చూడాలన్న శ్రీజ కోరికను తల్లిదండ్రులు మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌కు తెలియజేశారు. దీంతో పవన్‌ను మేక్‌ ఏ విష్‌ ప్రతినిధులు సంప్రదించి శ్రీజ కోరికను తెలిపారు. దీంతో పవన్‌ ఖమ్మం వచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పరామర్శించారు.

ఆళ్లగడ్డ: శోభ కూతురు అఖిలప్రియ నామినేషన్

కర్నూలు: ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దివంగత మాజీ పమ్మెల్యే శోభా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ శుక్రవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆళ్లగడ్డ తహసీల్డార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట తండ్రి భూమా నాగిరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ పన్నికల్లో ప్రచారం ముగుస్తుండగా శోభా నాగిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణించినప్పటికీ ఎన్నికల్లో గెలిచినట్లు అధికారులు ప్రకటించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా, తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కొద్ది రోజుల క్రితం.. తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో చెప్పారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు. అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు. అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎవరైనా మృతి చెందితే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ పెట్టవద్దనే సంప్రదాయం మన దగ్గర ఉంది. ఇటీవల కృష్ణా జిల్లాలో తండ్రి చనిపోతే, టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య పోటీ చేశారు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే సంప్రదాయం పాటిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశముంది. టీడీపీ పోటీ చేయకపోవచ్చునని చెబుతున్నారు. కానీ, స్థానిక నేతల నుండి మాత్రం ఒత్తిడి ఉంది. ఎన్నికల షెడ్యూల్ నామినేషన్లు - సెప్టెంబర్ 14 - 21 వరకు పరిశీలన - సెప్టెంబర్ 22న ఉపసంహరణ - సెప్టెంబర్ 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న
ఆళ్లగడ్డ: శోభ కూతురు అఖిలప్రియ నామినేషన్

అమ్మ నిరూపిస్తే మీసం తీసేస్తా: జయపై విజయకాంత్ సవాల్

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ చాలా రోజుల తర్వాత సీన్లోకి వచ్చారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శుక్రవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో.. అమ్మ తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తానని విజయకాంత్ సవాల్ చేశారు.
 
విజయకాంత్ బుధవారం చెన్నైలో, గురువారం రిషి వందియం నియోజకవర్గంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్టపడి పని చేసి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చానన్నారు. 
 
తమిళనాడులో పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని, ప్రతిపక్షాలను నీచంగా చూశారని, ఇప్పుడు వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూడాలని, జయలలిత జైలులో ఉండటాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ధర్మం గెలుస్తుందన్నారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి శిక్ష తప్పదన్నారు.

జయలలితకు ఊరట... సుప్రీంకోర్టులో బెయిల్.. డిసెంబర్ 18 వరకే...

Jayalalithaaతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో కింది కోర్టు విధించిన శిక్షను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టులో పేపర్ బుక్‌లెట్‌తో అక్రమాస్తుల కేసు విచారణకు సిద్ధం కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం డిసెంబర్ 18వ తేదీ వరకు గడువు విధించింది. ఆ లోపు జయలలిత కర్ణాటక హైకోర్టులో తన కేసును తేల్చుకోవాల్సి ఉంటుంది. 
 
అక్రమాస్తుల కేసులో బెయిల్ కోరుతూ జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి దత్తు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జయలలిత బెయిల్ పిటీషన్‌ను విచారించి, బెయిల్‌ను మంజూరు చేసింది. అదేసమయంలో అక్రమాస్తుల కేసులో పేపర్ బుక్‌లెట్‌తో కర్ణాటక హైకోర్టులో విచారణకు సిద్ధం కావాలాని, ఇందుకోసం ఆరు వారాల సమయమిస్తున్నట్టు ధర్మాసనం సూచన చేసింది. 
 
కాగా, జయలలిత అక్రమాస్తుల కేసులో గత నెల 27వ తేదీన నాలుగేళ్ళ జైలుశిక్షతో పాటు.. రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమె అప్పటి నుంచి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 
 
జయలలిత తరపున ప్రముఖ న్యాయవాదులు పాలీ నారీమన్, సుశీల్ కుమార్, తులసి, రాంజెఠ్మలానీలు వాదనలు వినిపిస్తున్నారు. తమ వాదనలను కర్ణాటక హైకోర్టు పట్టించుకోలేదని వారు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

Thursday 16 October 2014

బైపాస్ విధానం ద్వారా విద్యుత్

శ్రీకాకుళం: పట్టణానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయబడింది. దేశంలోనే మొదటిసారిగా బైపాస్ విధానం ద్వారా ఇక్కడ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు ఈరోజు విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉంది. మరో వైపు తుపాను సహాయార్థం బెంగాల్ నుంచి 50 లారీల కూరగాయలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.  

నల్గొండ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.

జయలలిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు బెయిల్ ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై నేడు టీడీపీ నేతల భేటీ

కర్నూలు: జిల్లా టీడీపీ నేతలు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ కానున్నారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికపై నేతలు చర్చించనున్నారు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యింది

కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం

మహరాష్ట్ర: కాకినాడ- షిర్డీ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ స్టేషన్ లో దొపిడీ దొంగలు చోరికి పాల్పడ్డారు. ప్రయాణీకులను కత్తులతో బెదిరించి బంగారం, బ్యాగులను దొంగలు ఎత్తుకెళ్లారు. 

సింహాద్రి విద్యుత్ రాకనే తెలంగాణలో ఇక్కట్లు...చర్చకు సై : కేసీఆర్

power crisisతుఫాను కారణంగా విశాఖపట్నంలోని 2 వేల మెగావాట్ల సింహాద్రి విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన నిలిచిపోవడంతో తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ఆగిపోయిందని, ఫలితంగా తెలంగాణాలో కరెంట్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు అభిప్రాయపడ్డారు. అదేసమయంలో విద్యుత్ డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోవడం మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. 
 
విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సమీక్షించారు. గత ఏడాది కంటే ఈ సారి విద్యుత్ డిమాండ్ 32.54 శాతం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. 143 మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో డిమాండ్ 126 మిలియన్ యూనిట్లు ఉంటే.. 122 మిలియన్ యూనిట్లు సరఫరా చేశారని తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. జల విద్యుత్ ఉత్పత్తిని సాధ్యమైనంత మేరకు పెంచి, పంటలను ఆదుకునే యత్నం చేస్తున్నామని చెప్పారు. సింహాద్రి ప్రాజెక్టులో గురువారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, మిగతా ఉత్పత్తి ప్రారంభమైతే పరిస్థితి మెరుగుపడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరతో సంబంధం లేకుండా ఎక్కడ విద్యుత్ లభిస్తే.. అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఇస్తే.. తెలంగాణలో వ్యవసాయానికి మరికొంత విద్యుత్ ఇవ్వడం సాధ్యమవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.