Sunday 30 November 2014

హ్యాపీగా శ్రీజ బర్త్‌డే ఆస్పత్రిలో పవన్‌ అభిమాని పుట్టినరోజు వేడుక ఈ వారంలో డిశ్చార్జ్‌ చేస్తాం: వైద్యులు

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? లేకపోతే పక్కన ఉన్న ఫొటో చూడండి! ఆ.. ఆ పాపే!! మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ పవన్‌ కల్యాణ్‌ను చూడాలని తపించిన ఆ చిన్నారి శ్రీజనే ఈమె. వైద్యుల చేతి చలువ.. పవన్‌ పరామర్శ బలం.. ఫలించి కోలుకుంది. ఆస్పత్రిలోనే ఆదివారం పుట్టినరోజు జరుపుకొంది.
ఖమ్మం (చర్చి కాంపౌండ్‌), నవంబర్‌ 30: ‘ఎక్యూట్‌ డిస్సెమినేటెడ్‌ ఎన్‌సెఫలోమైలైటిస్‌’తో 3 నెలలుగా ఖమ్మంలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీజ... ఆమెను చూసేందుకు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఆస్పత్రికి వెళ్లి కంటతడి పెట్టిన సంగతి గుర్తుందా? ఇప్పుడా పాప క్షేమంగా ఉంది. ఆదివారం ఆస్పత్రిలోనే 13వ పుట్టినరోజు వేడుక చేసుకుంది. అక్టోబర్‌ 2న ఆమె ప్రాణాపాయ స్థితిలో వచ్చిందని.. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, మరికొంత కోలుకున్నాక ఈ వారంలోనే డిశ్చార్జ్‌ చేస్తామని.. శ్రీజకు వైద్యం చేస్తున్న కార్తీక్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ అసాధారణ్‌ తెలిపారు. శ్రీజ ఆరోగ్య పరిస్థితిపై అందరూ వాకబు చేస్తుండటంతో ఆస్పత్రిలోనే జన్మదిన వేడుక జరిపి, విలేకరులను పిలిచి, అందరికీ ఆమె పరిస్థితి తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శ్రీజ కూడా మాట్లాడింది. ‘నా పేరు శ్రీజ. నేను పాల్వంచ డీఏవీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను’ అని చెప్పింది. ఆమె తనంతట తానే నడవగలుగుతోంది. కొద్దికొద్దిగా తినగలుగుతోంది. కాగా.. శ్రీజ తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్‌ ఆస్పత్రిలో 21రోజులు శ్రీజను ఐసీయూలో ఉంచినా, చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని గుర్తు చేసుకున్నారు. అయితే, కొందరి సలహా మేరకు ఖమ్మం తీ
సుకొచ్చామన్నారు. శ్రీజ కోలుకోవడం లో డాక్టర్‌ అసాధారణ్‌, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆమెను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌కు, ఆర్థిక సహాయం చేసిన పవన్‌ అభిమానులకు, ఆమెకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, కేటీపీఎస్‌లోని తన తోటి ఉద్యోగులకు, పవన్‌ కల్యాణ్‌ రాక కోసం కృషిచేసిన ‘మేక్‌ ఎ విష్‌’ సంస్థకు, మీడియాకు.. వారు కృతజ్ఞతలు తెలిపారు.
పవన్‌ మళ్లీ వస్తాడా?
‘శ్రీజా.. నేను పవన్‌ కల్యాణ్‌ను వచ్చాను లేమ్మా’.. అక్టోబర్‌ 17న ఆమెవద్దకు వచ్చిన పవన్‌కల్యాణ్‌ పలకరించిన తీరిది! ఆ రోజు అరగంట శ్రీజ వద్దే కూర్చున్న పవన్‌ ఒకదశలో కంటతడిపెట్టడం తెలిసిందే. ఆ చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి.. శ్రీజ తప్పకుండా కోలుకుంటుందని, ఆ విషయం తెలిపితే మళ్లీ వస్తానని వారికి భరోసా ఇచ్చారు. పవన్‌కల్యాణ్‌ అంటే ప్రాణం పెట్టే శ్రీజ.. తనకోసం ఆ పవర్‌స్టారే దిగివచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉంది. కొద్దిసేపు కళ్లు తెరిచినా అది గుర్తుందో లేదో. ఇప్పుడామె కోలుకుంది. పవన్‌ ఆమెను చూడ్డానికి మళ్లీ వెళ్తాడా? పరామర్శిస్తాడా? చిన్నారి అభిమానికి ఆనందం కలిగిస్తాడా? మాట నిలబెట్టుకుంటాడా?వేచి చూడాల్సిందే!!

సోదరితో వివాహేతర సంబంధం అంటగట్టినందుకు హత్య

విశాఖపట్నం: నిత్యం తన చెల్లెలను వేధించడంతోపాటు, ఆమెతో తనకు వివాహేతర సంబంధాన్ని అంటగట్టడాన్ని తట్టుకోలేని ఓ సోదరుడు తన బావమరిదిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. గబ్బంగి పంచాయతీ పనసపల్లికి చెందిన పాంగి తిరుపతి రావు(40) చిన్నాన్న కుమార్తె పార్వతమ్మను జీ మాడుగుల మండలం సింగర్భకు చెందిన చిట్టిబాబు(35)కు ఇచ్చి పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం చిట్టిబాబుతో అతడి కుటుంబాన్ని పనసపల్లికి తెచ్చిన తిరుపతి రావు అతడికి కొన్ని పశువులను అప్పగించి పశువుల కాపరిగా ఉంచాడు. గత ఏడాది ఇద్దరి మధ్య మసస్పర్థలు రావడంతో తన భార్యతో తిరుపతి రావుకు వివాహేతర సంబంధం ఉందంటూ చిట్టిబాబు ప్రచారం చేయడం ప్రారంభఇంచాడు. మద్యం తాగి వచ్చి గొవడపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో పార్వతమ్మ శనివారం కూలీ పనుల కోసం వెళ్లింది. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంట్లో భర్త చనిపోయి ఉండటంతో పార్వతమ్మ..సమీపంలోనే ఉన్న సోదరుడు తిరుపతి రావు ఇంటికెళ్లి వదినకు చెప్పింది. చిట్టిబాబు దుష్ప్రచారాన్ని తట్టుకోలేక అతనిని చంపేశానని చెప్పి తిరుపతి రావు గ్రామం వదిలి వెళ్లాడని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. హైవేపై దొంగతనం జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తకోట నుంచి వనపర్తి వెళ్ళే దారిలోని గుంపు గట్టు దగ్గర ఒక కారు పై దాడి చేశారు. కారులో ఉన్న వారిని గాయపరచి వారివద్ద ఉన్న నగదు లాక్కున్నారు. అదే దారిలో వస్తున్న ఓ అంబులెన్సు పై కూడా దాడి చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు గాయపడినట్టుగా తెలుస్తోంది

కరీంనగర్‌లో పేలుడు, చెల్లాచెదురైన శరీర భాగాలు

హైదరాబాద్: కరీంనగర్‌ శివారులో ఉన్న హౌజింగ్‌బోర్డు కాలనీ ఓ ఇంట్లో ఆదివారం ఉదయం 6 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల శరీర భాగాలు మాంసం ముద్దలుగా మారాయి. ఈ పేలుడు సంఘటనలో కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన పట్నం నాగార్జున కుమార్‌ (34), మ ల్లు రామకృష్ణారెడ్డి (60)లు దుర్మరణం చెందగా పట్నం శ్రీనివాస్‌కుమార్‌ (26)కు తీవ్రగా యా లతో పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరబాద్‌కు తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పట్నం నాగార్జున కుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌ సోదరులు 12 సంవత్సరాల నుంచి కరీంనగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో దేవతలు, ఇతర బొమ్మలు తయారు చేసి విక్రయిస్తుంటారు. వీరి వద్ద వంట మనిషిగా అదే గ్రామానికి చెందిన మల్లు రామకృష్ణారెడ్డి పని చేస్తున్నాడు. ఇంట్లోని రెండు గదులను గోదాంగా చేసి అక్కడే బొమ్మల తయారీకి ఉపయోగించే రసాయనాలు నిల్వ ఉంచుతారు. అయితే శనివారం మద్యాహ్నం వీరు నివాసముంటున్న ఇంటి ఆవరణలో పేలుడు జరిగింది. గడువు ముగిసిన హార్డినరీ రసాయనంపై ఒత్తిడి కారణంగానే అది పేలిందని పోలీసులు భావిస్తున్నారు. 

ఇక పోస్టాఫీసుల్లోనూ శ్రీవారి దర్శన టికెట్లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్ల బుకింగ్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.
 
చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులోను, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభిస్తారు.
 
ఇవి ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు

మరోసారి తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ముంబై, నవంబర్‌ 30 : వాహనదారులకు శుభవార్త... పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి తగ్గాయి. పెట్రోలు లీటరుపై 91 పైసలు, డీజిల్‌పై 84 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌, విశాఖపట్టణంలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 70 లు కన్నా దిగువకు రానునంది. లీటరు డీజిల్‌ ధర స్థానిక పన్నులతో కలిసి రూ. 57 రూపాయలకు చేరనుంది. తగ్గిన పెట్రో ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధర 70 డాలర్లకన్నా తక్కువకు పడిపోవడంతో ఈ మేరకు ధరలు తగ్గాయి. పెట్రోలు ఎగుమతి దేశాలు సైయితం ఉత్పత్తిని తగ్గించబోమని ప్రకటించాయి

ఈవ్‌ టీజర్‌ భరతం పట్టిన ఇద్దరు అమ్మాయిలు


హర్యానా, నవంబర్‌ 30 : బస్సులో ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన పోకిరిని ఇద్దరు అమ్మాయిలు బెల్ట్‌ తీసి చితక్కొట్టారు. ఈ ఘటన హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగింది. బస్సులో అంతమంది ప్రయాణీకులు ఉన్నా ఎవరూ వీరికి సాయం రాలేదు. ఆ ఇద్దరు అమ్యాయిలే ధైర్యంగా పోకిరీని ఎదుర్కొన్నారు. దాంతో ఆగకుండా ఆ పోకిరిని పోలీసులకు అప్పగించారు

Friday 28 November 2014

బతికుండగానే పవన్ కళ్యాణ్ విగ్రహం

ఈ అభిమానులనేవాళ్ళున్నారే.. ఒక్కోసారి వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలియదు. సాధారణంగా ఎవరైనా పోయాక విగ్రహాలు పెడతారు. అభిమానం ముదిరిపోయిన అభిమానులు తాము అభిమానించే వారికి బతికుండగానే విగ్రహాలు పెట్టేస్తారు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్‌లో మాయవతి విగ్రహాలు అలాగే పెట్టారు. అలాగే తెలంగాణ దేవత సోనియాకి గుడి కట్టించి, అందులో ఆమె విగ్రహాన్ని కూడా మాజీ మంత్రి శంకర్రావు ఇటీవల పెట్టించారు. ఇప్పుడు బతికుండగానే విగ్రహాలు పెట్టించుకునే లిస్టులోకి పవన్ కళ్యాణ్ కూడా చేరబోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పవన్‌కళ్యాణ్ విగ్రహం ఏర్పాటుచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరంలో విగ్రహం కూడా తయారైపోతోంది. కొంతమంది జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్డర్ ఇచ్చిన మీదట ఈ గ్రామానికి చెందిన శిల్పి అరుణప్రసాద్ వడయార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.



శ్వేతాబసు ప్రసాద్.. మళ్ళీ నటన

సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ తిరిగి తన నట జీవితాన్ని ప్రారంభించారు. చాలాకాలం తర్వాత ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించబోతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు హన్సల్ మెహతా రూపొందిస్తున్న ఒక డాక్యుమెంటరీలో శ్వేతాబసు ఇప్పుడు నటించబోతోంది. ఒక స్టార్ హోటల్లో అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నామంటూ పోలీసులు ఆమెను కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని రెస్క్యూ హోమ్‌కి పంపిన విషయం తెలిసిందే. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని శ్వేతాబసు ప్రసాద్ చెబుతోంది. నిజానిజాలు ఎలా వున్నప్పటికీ శ్వేతాబసు ప్రసాద్ మళ్ళీ తన నట జీవితాన్ని కొనసాగించడం అభినందనీయమైన విషయం. శ్వేతా బసు ప్రసాద్ ప్రస్తుతం నటిస్తున్న డాక్యుమెంటరీలో ఆమె చాలా కీలకమైన పాత్ర ధరిస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నతనంలోనే నటిగా జాతీయ అవార్డును పొందిన శ్వేతా బసు ప్రసాద్ ఈ డాక్యుమెంటరీలో కూడా జాతీయ స్థాయి అవార్డు పొందేంత మంచి పాత్రను ధరిస్తున్నట్టు సమాచారం. ఈ డాక్యుమెంటరీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.

ఉదయ్‌కిరణ్‌ హత్య దారుణం..

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారం‌లో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్‌కిరణ్ హత్యకి గురయ్యాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్ళిన ఉదయ్‌కిరణ్ గురువారం సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్‌కిరణ్ మృతదేహం కనిపించింది. ఉదయ్ కిరణ్‌ని హత్య చేసిన వారు శవాన్ని నీటిలో వేశారు. శవం పైకి తేలకుండా ఉండటానికి మృతదేహం మీద పెద్ద బండరాయిని పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఉదయ్ కిరణ్‌ని అతని పెదనాన్న కుమారుడు నవీన్ హత్య చేసినట్టు కనుగొన్నారు. నవీన్ శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పెద్దల మధ్య వున్న ఆస్తి గొడవల కారణంగానే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఉదయ్ తల్లిదండ్రులకు చాలాకాలానికి కలిగిన కుమారుడు. అది కూడా సరోగసీ పద్ధతి ద్వారా జన్మించాడు. ఉదయ్ కిరణ్‌ని చంపిన నవీన్ గత కొంతకాలంగా ఏ పనీలేక జులాయిగా తిరుగుతున్నాడు. గతంలో హోంగార్డు ఉద్యోగాన్ని సంపాదించాడు. నకిలీ ధ్రువపత్రాలతో హోంగార్డు ఉద్యోగం పొందిన అతనిని విధుల నుంచి తప్పించారు. ఇప్పుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Wednesday 26 November 2014

వ్యభిచరిస్తూ దొరికిపోయిన నటి

ఈమధ్యకాలంలో టెలివిజన్ సీరియళ్ళలో నటిస్తున్న నటీమణులు ‘అలాంటి’ పరిస్థితుల్లో దొరికిపోవడం మామూలైపోయింది. హైదరాబాద్‌ నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉండకూడని విధంగా ఇద్దరు యువకులతో కలసి వున్న టెలివిజన్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వేళలో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా సదరు టీవీ నటీమణి దొరికిపోయింది. ఆమెతోపాటు ఆమెతో వున్న మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన నటి ఒక ప్రముఖ తెలుగు సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

భార్యతో ఏకాంతానికి అడ్డని ఆరాధ్యని చంపేశాడు

ఒంగోలులో మంగళవారం నాడు ఏడాదిన్నర వయసున్న ఆరాధ్య అనే బాలిక కిడ్నాపైన విషయం తెలిసిందే. ఒంగోలులోని రాజా పానగల్‌రోడ్డులో నివసించే శ్రీధర్, సాహితి దంపతులు తమ కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జరిపిన పరిశోధనలో ఆరాధ్యను ఆమె బాబాయే హత్య చేశాడని వెల్లడయింది. ఆరాధ్య పిన్ని సింధు అనే యువతిని లక్ష్మీనారాయణ అనే యువకుడు మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరాధ్య ఎప్పుడూ తన పిన్నిని విడిచిపెట్టకుండా ఆమె దగ్గరే వుండేది. దాంతో తన భార్యతో గడపడానికి ఆరాధ్య ఎప్పుడూ అడ్డుగా వుంటోందన్న కోపంతో లక్ష్మీనారాయణ ఆరాధ్యని కిడ్నాప్ చేశాడు. మంగళవారం ఇంటి బయట ఆడుకుంటున్న ఆరాధ్యని బైక్ ఎక్కించుకుని ఊరిచివర్లో ఉన్న పంటచేల దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆరాధ్యని గొంతు పిసికి దారుణంగా హత్యచేశాడు. ఆ తర్వాత ఆరాధ్య మీద పెట్రోలు పోసి నిప్పంటించాడు. లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.

Tuesday 18 November 2014

హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్టు

హైదరాబాద్: మయన్మార్‌కు చెందిన ఉగ్రవాది ఖలీద్‌ను జాతీయ భద్రతా సంస్థ అధికారులు అరెస్టు చేసినట్లు తెలిసింది. వర్థమాన్ పేలుడు కేసులో ఖలీద్‌కు సంబంధం ఉంది.

తెరాసలో చేరనున్న మరో విపక్ష సభ్యులు.. కేసీఆర్ ప్రోత్సాహంతో

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో ప్రతిపక్షాలకు చెందిన మరో నలుగురు శాసనసభ్యులు చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నలుగురిలో కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
మరోవైపు సాక్షాత్ ముఖ్యమంత్రే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనీ దీనిపై సభలో చర్చ జరపాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టి ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌కు గురైన విషయం తెల్సిందే. తమ పార్టీ శాసనసభ్యులను నిలువరించుకోవడానికే కాంగ్రెస్ శాసనసభ్యులు శాసనసభలో దుమారం రేపినట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌లోకి వలసలు ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని సాధించేందుకే తాము తెరాసలో చేరుతున్నట్లు పార్టీ మారుతున్న శాసనసభ్యులు చెబుతున్నారు. ఇటీవలే టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ శాసనసబ్యుడు కె. యాదయ్య వ్యవహారంపై అధికార టిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాలకు మధ్య శాసనసభ ఆవరణలో మాటల యుద్ధం నడిచిన విషయం తెల్సిందే.

Monday 17 November 2014

ఉస్మానియా బిడ్డల మీద లాఠీ విరిగింది

 ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద లాఠీ విరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం మానుకోవాలని కోరుతూ ఉస్మానియా విద్యార్థి, నిరుద్యోగ ఐకాస అసెంబ్లీకి ర్యాలీ చేపట్టింది. అయితే పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధం చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. దాంతో విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ అసెంబ్లీకి వెళ్తున్న తమమీద ఈ దౌర్జన్యం ఏమిటని పోలీసులను ఆగ్రహంగా ప్రశ్నించారు. అయితే విద్యార్థుల ప్రశ్నలకు పోలీసులు లాఠీలతో సమాధానం చెప్పారు. ప్రశ్నించినందుకు బహుమతిగా లాఠీలతో విద్యార్థులను చావబాదారు. ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను చావబాదారు. తమ అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను పోలీసులు చావబాదుతూ ఉండటం చూసి విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసు నిర్బంధాన్ని తప్పించుకుని అసెంబ్లీ వైపు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా విద్యార్థులను అడ్డుకోవడానికి తమ బలాన్ని, లాఠీలను, బూటు కాళ్ళను ఉపయోగిస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. కొంతమంది విద్యార్థుల తలలు పగిలినట్టు తెలుస్తోంది. తమను లాఠీలతో దారుణంగా చితకబాదుతున్న పోలీసుల మీదకు విద్యార్థులు రాళ్ళతో దాడి చేశారు.

స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉంది

సిడ్నీ :  భారత ప్రధాని నరేంద్ర మోదీకి ...సిడ్నీలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు వేద మంత్రాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతించారు. సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ స్టేడియంలో మోదీ ప్రసంగించారు. ముందుగా ఆయన తన ప్రసంగాన్ని ముందుగా ఇంగ్లీష్ లో ప్రారంభించి అనంతరం హిందీలో మాట్లాడారు.  సిడ్నీలో ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలుగుతోందన్నారు.  మీ ప్రేమ, స్వాగతం 123 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు మోదీ తెలిపారు. 50 ఏళ్ల క్రితమే స్వామి వివేకానందుడు తన ఆలోచనలను ప్రపంచానికి అందించారని ఆయన అన్నారు.

ప్రపంచమంతా ఒక్క తాటిపైకి రావాలని వివేకానందుడు పిలుపునిచ్చారని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర భారతంలో పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్య సమరంలో తాను పాలుపంచుకోనందుకు బాధగా ఉందని ఆయన అన్నారు. దేశం కోసం మరణించే అవకాశం అందరికీ రాదని మోదీ పేర్కొన్నారు.  స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కలేదన్న బాధ ఉందని ఆయన అన్నారు.   భారత ప్రధాని ఆస్ట్రేలియా రావటానికి 28 ఏళ్లు పట్టిందని మోదీ తెలిపారు.

Sunday 16 November 2014

నాగార్జున వర్సిటీలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేవ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. యూనివర్సిటీలోని ఆడిటోరియం అసెంబ్లీ నిర్వహణకు బాగుంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఏపీ రాజధానిని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతవరకు నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా ముఖ్య శాఖల కార్యాలయాలను తరలించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లో సల్మాన్ చెల్లి పెళ్లికి 2 కోట్లు..తరలి వస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమాలో ఈనెల 18న జరిగే వేడుక కోసం సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలి రానున్నారు. 
సల్మాన్ చెల్లెలు అర్పిత వ్యాపార వేత్త ఆయుష్ శర్మ ఈనెల 18న ఒక్కటౌతున్నారు. ఈ వివాహ వేడుక కోసం సల్మాన్ అక్షరాలా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట.
చారిత్రక ఫలక్ నుమా నిజాం ప్యాలెస్ ను చెల్లి పెళ్లి కోసం ఈనెల 17,18,19 తేదీలను సల్మాన్ ఖాన్ ఇప్పటికే బుక్ చేశారు. ఈ హోటళ్లో 60 గదులున్నాయి. 
ఈ వేడుకకు రావాల్సిందిగా సల్మాన్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి రాలేనని చెప్పారు. అలాగే సోనియాగాంధీని ఆహ్వానించినా కుదరదని చెప్పేసింది. ఇదిలా ఉంటే...బాలీవుడ్ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యేందుకు తరలిరానున్నారు. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకునే, సైఫ్ అలీఖాన్, హేమమాలిని, ధర్మేంద్ర, కరణ్ జోహార్ తో పాటు చాలామంది బాలీవుడ్ తారలు హైదరాబాద్ కు తరలి రానున్నారు. 
ఇక టాలీవుడ్ కి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాంచరణ్, రాణాతో పాటు మరికొంతమందికి ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. 
ఈ వేడుక జరిగే మూడు రోజులు సందర్శకులను ఈ హోటల్ కు అనుమతించరు. వేడుక జరిగే ఆ మూడు రోజులు ప్రభుత్వ బందోబస్తుతో పాటు సల్మాన్ ప్రైవేట్ సెక్యూరిటీ కనుసన్నల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. 

పిల్లా నువ్వులేని జీవితం తొలి రోజు కలెక్షన్ల వివరాలు.. ఆశ్చర్యం.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన ఆరంగ్రేటం చిత్రం పిల్లా నువ్వులేని జీవితం సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమా అటు నైజాంతో పాటు ఇటు ఏపీలోను మంచి కలెక్షన్లు రాబడుతోంది. తొలి రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తొలి రోజు మొత్తంగా రూ 2.28 కోట్లను ఈ సినిమా వసూలు చేసింది.

నైజాం-85 లక్షలు
సీడెడ్- 42 లక్షలు
గుంటూరు-24.6 లక్షలు
వైజాగ్-23 లక్షలు
తూర్పు గోదావరి- 21.8 లక్షలు
పశ్చిమ గోదావరి- 14.5 లక్షలు
కృష్ణా- 10.8 లక్షలు
నెల్లూరు- 7.3 లక్షలు
ఈ సినిమా తొలి రోజే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ భారీ కలెక్షన్లు సాధించింది. తొలి వారం ముగిసే సరికి బయ్యర్లు, నిర్మాతుల భారీగా లాభపడతారన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

బాహుబలితో పోటీకి గోపాలా.. గోపాలా.. బిగ్‌ఫైట్‌కు రెఢీ

క్టరీ వెంకటేష్-పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం గోపాలా.. గోపాలా తొలుత సంక్రాంతి బరిలో ఉంటుందని అందరూ ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకుందని అంటున్నారు. మరో 20 రోజుల షూటింగ్‌తో పాటు పవన్ పార్ట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమేనన్న అభిప్రాయం టాలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. 

సంక్రాంతికి గోపాలా మిస్ అయితే సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో బాహుబలితో పోటీకి సిద్ధమవుతుందని సమాచారం. అదే జరిగితే భారీ బడ్జెట్ సినిమా బాహుబలి వర్సెస్ గోపాలా.. గోపాలా పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

తెరాసలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే యాదయ్య.. లైన్లో మాజీ మంత్రి, తేదేపా ఎమ్మెల్యే


తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు తేదేపా, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికార తెరాసలో చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం కాంగ్రెస్‌కు చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ఈ రోజు తెరాస గూటికి చేరుతున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా భారీగా తెరాసలో చేరుతుండడంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కనుమరుగైంది.

ఇదిలా ఉంటే తెరాసలో చేరేందుకు కాంగ్రెస్‌కే చెందిన మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తెరాస మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఆయన ప్రస్తుతానికి మౌనంగా ఉన్నా కొద్ది రోజుల్లో తెరాసలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తోలుకుంట్ల ప్రకాష్‌గౌడ్ కూడా తెరాసలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. ఆయనతో జిల్లాకు చెందిన మంత్రి మహీధర్‌రెడ్డి మంతనాలు జరుపుతున్నారట.

ఇంటిని ఖాళీ చేయాలని నాకు నోటీసిస్తారా?.. అన్యాయం: చిరంజీవి ప్రశ్న

chiranjeevi
ఢిల్లీలో తాను నివాసముంటున్న ఇంటిని ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూ) అధికారులు తనకు నోటీసు ఇవ్వడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటీసు అంశంపై ఆయన మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమన్నారు. ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే, తనకు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇప్పుడే ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. 
 
తన పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నివాసం కేటాయించాలని కోరానని, అప్పుడు స్పందించని అధికారులు.. ఇపుడు ఉరుకులు పరుగుల మీద ఇల్లు ఖాళీ చేయాలని నోటీసు ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైన మించి పోయిందేమీ లేదనీ తనకు సరైన ఇంటిని చూపిస్తే తక్షణం ఖాళీ చేస్తానని చిరంజీవి తెలిపారు.
 
కాగా, చిరంజీవి ఢిల్లీలో ప్రస్తుతం ఉంటున్న అధికారిక ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ గురువారం కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) నోటీసు అంటించిన సంగతి తెలిసిందే.