Sunday 14 September 2014

అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తింటే?

అంటురోగాలు అంటకుండా ఉండాలంటే? శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఫ్లూ వంటి అంటురోగాలు ఏవైనా రాకుండా చూసుకోవడం ముఖ్యం. ఇటువంటి వాటికి చికిత్స ప్రారంభమయ్యే లోగానే శరీరం బలహీనపడుతుంది. ఇంట్లో ఏ ఒక్కరికీ అంటురోగం వచ్చినా అది అందరికీ వ్యాప్తిస్తుంది. 
Amla, young look 
ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తి ఉసిరి ఇవ్వండి. ఉసిరిపొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. 
 
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసి క్రమం తప్పక తీసుకోండి. ఇవి ఏంటీవైరస్, ఏంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. 
 
యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి. పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్ల మిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

No comments:

Post a Comment