Tuesday 23 September 2014

బాణాసంచా పేలుడు: 12 మంది మృతి

చైనాలోని ఓ బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదు. లిల్లింగ్‌టన్ సిటీలోని బావోఫెంగ్ గ్రామంలో వున్న ఫ్యాక్టరీలో మంగళవారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో 47 మంది బాణాసంచా తయారీ విధుల్లో వున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన ఇద్దరు వ్యక్తుల శరీరాలు ముక్కలు ముక్కలు అయిపోయి వుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఇద్దరూ పేలుడుకు అతి సమీపంలో వున్నందవల్లనే వారీ శరీరాలు కూడా కనిపించకుండా పోయాయని భావిస్తున్నారు

ఏపీలోని నిరుద్యోగులకు వయో పరిమితి పెంపు

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులయ్యే వారికి వయోపరిమితి సడలింపు ఇచ్చారు. 34 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పొడగిస్తున్నట్లు ఏపీ సీఎస్ వై. కృష్ణారావు ప్రకటించారు. ఈ నిబంధన 2016, సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. ఈ నిబంధన పోలీస్, ఫారెస్ట్, ఫైర్, ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే నోటిఫికేషన్లకు వర్తించదని స్పష్టం చేశారు

ఏపీ సీఎంతో ఎర్రబెల్లి, రేవంత్, ధర్మారెడ్డి భేటీ

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మారెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో ఈ మధ్య పార్టీలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన మాట వాస్తవమేనని ఎర్రబెల్లి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబు, ఎర్రబెల్లి మధ్య భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కొందరు నేతలు ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని రేవంత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎర్రబెల్లి ఉదయం మీడియాతో చెప్పిన సంగతి విదితమే. ధర్మారెడ్డి ఎర్రబెల్లి శిష్యుడు

బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని.

బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని..అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు, మహిళలను నట్టేట ముంచిన సిఎం చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నివాసం నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. కార్యాలయం ఎదుట రెండు గంటలపాటు బైఠాయించారు. యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా చంద్రబాబును శైలజానాథ్ ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చామని ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలవా అని శైలజానాథ్ నిలదీశారు. దివంగత సిఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి ప్రమాణ స్వీకారం రోజునే దాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు
బాబును ఉరితీయాలి: శైలజానాథ్, మోసమెందుకని..

తెలంగాణ ఫాస్ట్ జీవో.. దేశ సమగ్రతకే ముప్పు : హైకోర్టు


తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశిస్తూ తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ వంటి పథకం దేశ సమగ్రతకే ముప్పు అని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి ఉత్తర్వులు దేశంలో వేర్పాటువాదానికి దారితీస్తాయంటూ తెలంగాణ సర్కారుపై మండిపడింది. అసలు ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే వస్తే మీకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. 
 
ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ నివాసముంటున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామంటూ... ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ పేరిట తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ మేరకు జీవో కూడా జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ.. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 
 
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ‘భారతదేశం ఒక్కటే. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఈ దేశ పౌరులే. పేద విద్యార్థులకు (ఎస్సీ, ఎస్సీ, బీసీల)కు ఆర్థిక సాయం చేస్తున్నామంటే మేం అర్థం చేసుకోగలం. తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే ప్రభుత్వం ఎందుకు ‘ఫాస్ట్’ జీవోను తీసుకువచ్చింది..? దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఎందుకు వర్తింపజేయడం లేదు. ఎందుకీ వివక్ష..? తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.’ అంటూ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
‘మీరు జారీ చేసిన ‘ఫాస్ట్’ జీవో జాతీయ సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఉందా..? మీరు ఈ జీవోను ఎలా సమర్థించుకుంటారు? ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం అభినందనీయంగా లేదు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారు..? మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుంది..?’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. 
 
‘మనం సమైక్య రాజ్యంలో ఉన్నాం. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా..? సమైక్య రాజ్యంలో వివక్షకు తావు లేవు. స్థానికత ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. విధానం ఏదైనా సరే అది జాతి సమగ్రతను, సమైక్య స్ఫూర్తిని పెంపొందించేదిగా ఉండాలి. ఇటువంటి వివక్షాపూరిత విధానాలను మనం అడ్డుకోకుంటే... దుష్టశక్తులు ప్రవేశించి మన రాజ్యాంగ, సమైక్య స్ఫూర్తిని నాశనం చేస్తాయి. ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేసే ముందు జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుత వ్యవహారంలో జాతి సమగ్రత లోపించినట్లు కనిపిస్తోంది..’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

ఐఐఎంలో ప్రేమ పేరుతో మోసపోయిన మాజీ లెక్చరర్

న్యూఢిల్లీ: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆపై అత్యాచారం చేశాడని మాజీ ప్రియుడు, పిహెచ్‌డీ విద్యార్దిపై ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ శాటిలైట్ ఏరియా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అహ్మాదాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో బాధితురాలు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసింది. పీహెచ్‌డీ చేసేందుకు సందీప్ కృష్ణన్ అదే ఐఐఎంలో చేరాడు. వీరిద్దరి మధ్య చనువు కాస్త పెరిగి , అది ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి బాధితురాలిని నమ్మించి.. శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత సందీప్ కృష్ణన్ ఉద్యోగం నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నాడు. బాధితురాలు కూడా తన కాంట్రాక్ట్ ముగియడంతో బెంగుళూరుకి చేరుకుంది. ఇటీవల సందీప్‌కు మరో మహిళతో వివాహం అయినట్లు తెలుసుకున్న బాధితురాలు తాను మోసపోయానని భావించి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సందీప్ కృష్ణన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

రామ్ చరణ్ - శ్రీను వైట్ల ప్రాజెక్టుపై నీలి మేఘాలు


ram charan - srinu vaitla
టాలీవుడ్ సక్సెస్ డైరక్టర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన శ్రీను వైట్ల.. ఇపుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. మహేష్ బాబు హీరోగా తన దర్శకత్వంలో వచ్చిన 'ఆగడు' చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన విషయం తెల్సిందే. దీంతో శ్రీను వైట్ల - రామ్ చరణ్ ప్రాజెక్టుపై నీలి మేఘాలు కప్పుకున్నాయి. 
 
వాస్తవానికి శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని షెడ్యూల్ ప్రకారం రామ్ చరణ్‌తో చేయాల్సివుంది. అందుకోసం కథను కూడా ఎప్పుడో ఓకే చేసుకున్నాడు. అయితే, ఈ ప్రాజక్టుపై ఇప్పుడు నీలిమేఘాలు కమ్ముకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
దీనికి కారణం, దర్శకుడు శ్రీను తాజాగా రూపొందించిన 'ఆగడు' సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోవడమే! ఈ చిత్రానికి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. మహేష్, శ్రీనుల నుంచి భారీ అంచనాలతో రూపొందించారు. అయితే, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో డీలా పడ్డారు.
 
ఇక, సినిమా ఇండస్ట్రీలో బంధాలన్నీ సక్సెస్ పైనే ఆధారపడివుంటాయనేది కఠోర వాస్తవం. హిట్టిస్తే వెంటనే ఆ దర్శకుడితో సినిమా చేస్తారు. లేదంటే ఒప్పుకున్న చిత్రాన్ని కూడా డ్రాప్ చేసుకుంటారు. మరి, ఈ ప్రభావం రామ్ చరణ్‌పై కూడా ఉంటుందా? లేక ఇలాంటి వాటికి అతీతంగా ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తాడా? అన్నది చూడాలి! 

టీటీడీ చైర్మన్ పదవిపై కన్నేసిన హీరో శివాజీ



Hero Sivaji kandireega.comహీరో శివాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవిపై కన్నేశాడని తెలుస్తోంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ తనకు టీటీడీ పదవి వస్తుందని నమ్మకంగా చెప్పాడు. అయితే, పదవి కోసం తాను పైరవీలు చేయనని, పదవే తనను వెదుక్కుంటూ వస్తుందని కూడా శివాజీ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి, హీరో శివాజీ టీటీడీ చైర్మన్ రేసులో తానున్నానంటూ ప్రకటించాడు. బీజేపీ కూడా ఈ మేరకు శివాజీకి హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ పదవిపై హీరో శివాజీ ఈ విధంగా స్పందించడం టీడీపీ నాయకులలో కలకలం మొదలయ్యేలా చేసిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కనుమూరి బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవిలోనే కొనసాగాలని ఆశపడుతున్నారట. అయితే, అధికారంలోకి వస్తూనే నారా చంద్రబాబునాయుడు… చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. కాని, అది ఇంతవరకు కార్యరూపం దాచలేదు. ఐనప్పటికీ, టీడీపీ వర్గాలు టీటీడీ చైర్మన్ పదవి చదలవాడదేనని గట్టగా వాదిస్తున్నారు.
మరో పక్క నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్ తిరుపతి వెంకన్నకు సేవ చేయాలని తహతహలాడుతున్నారట. ఈ నేపథ్యంలో.. ఆగస్టులో టీటీడీ పాలక మండలిని రద్దు చేశారు. పాత పాలక“పదవి కోసం పైరవీలు చేయను” మండలిని రద్దు చేసి నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు కొత్త పాలకమండలిని నియమించలేదు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

కొలిక్కి వచ్చిన శివసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు బీజేపీకి 130 స్థానాలుఇవ్వడానికి శివసేన అంగీకారం



ముంబై, సెప్టెంబర్‌ 23 : మహారాష్ట్ర ఎన్నికల కోసం ప్రధాన పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వస్తున్నాయి. శివసేన-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించాయి. బీజేపీకి 130 స్థానాలు ఇవ్వడానికి శివసేన అంగీకరించింది. ఈ ఎన్నికల అంశం తెరమీదకు వచ్చిన నాటి నుంచి బీజేపీ తమకు 135 సీట్లు కావాలని పట్టుపట్టింది. శివసేన మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలలోలాగే 119 సీట్లు ఇస్తామని వాదించింది. 151 స్థానాల్లో తాము స్వయంగా పోటీచేయాలని శివసేన భావించింది.
 
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లలో 145 స్థానాలు సొంతంగా గెలుచుకోగలిగితే ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది శివసేన ఆలోచన. గత రెండు మూడు రోజులుగా శివసేన-బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం బీజేపీ కేంద్ర నాయకత్వం సమావేశమై 130 సీట్లు ఇవ్వాలని శివసేనను కోరింది. ఈ ప్రతిపాదనపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ థాక్రే మంగళవారం మధ్యాహ్నం వరకు మంతనాలు సాగించారు. చివరికి బీజేపీకి 130 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు.
 
మరోవైపు ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిలో మాత్రం ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మొత్తం సీట్లలో సగం స్థానాల్లో తాము పోటీ చేస్తామంటూ కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనకు ఎన్సీపీ ఒప్పుకోవడం లేదు. ఆ రెండు పార్టీల మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. శరద్‌పవర్‌ నివాసంలో ఎన్సీపీ మంతనాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఇరు పార్టీల నాయకులు మరోసారి సమావేశం కానున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈనెల 27వరకు గడవు ఉంది. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ చర్చల ఫలితాలు కూడా ఈ సాయంత్రం తెలిసే అవకాశం ఉంది.

దసరాకు ముహూర్తం ఖరారు: సైకిల్ దిగి కారెక్కనున్న ఎర్రబెల్లి!


తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. టీడీపీని వీడి ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని పరకాల టీడీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. 
 
errabelli dayakar raoతనను కూడా టీఆర్ఎస్‌లోకి రావాల్సిందిగా ఎర్రబెల్లి ఆహ్వానించారని... అయితే, ఆయన ఆఫర్‌ను తాను తిరస్కరించానని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దసరా తర్వాత ఎర్రబెల్లి టీఆర్ఎస్ తీర్ధం తీసుకోనున్నారని సమాచారం. 
 
తనతో పాటు, మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్‌లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎర్రబెల్లి దయాకర్ రావును తమ పార్టీలోకి ఆకర్షించేందుకు టీఆర్ఎస్ ఆయనకు మంత్రి పదవిని ఆఫర్‌‌ను చేసినట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయంపై ఎర్రబెల్లి తన అనుచరులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు

టీ రైతులకు శుభవార్త

telangana
చాలా కాలంగా రుణమాఫీ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల హామీల్లో భాగంగా తెరాస ప్రభుత్వం రైతుల రుణమాఫీ కోసం 17 వేల కోట్లు 
కేటాయించేందుకు సిద్ధమయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే 4250 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రుణమాఫీ కోసం ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం తాజాగా తమ నివేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు ఖరీఫ్‌ కోసంగాను రైతులకు కొత్త రుణాలు ఇవ్వాల్సిందిగా
 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన వారికి మాత్రమే రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ పాసు పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తించదని, వారిపై చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు మంత్రులు వెళ్లడిరచారు. వాణిజ్య పంటలైన మిరప, చెరకు పండిరచేందుకు రైతులు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయబోతున్నట్లు మంత్రులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటనతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది

పవన్ కళ్యాణ్ సర్‌ప్రైజ్: హైటెక్ సిటీ ప్రాంతంలో హల్‌చల్


23-pawan6077
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి అభిమానులకు, నగరవాసులకు హైటెక్ సిటీ ప్రాంతంలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. అనుకోని విధంగా ఆయన నగర వీధుల్లో కనిపించేసరికి ఆయన ఫోటోలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం గోపాల 
గోపాలా షూటింగులో ఉన్న విషయం తెలిసిందే.
 
ఆదివారం పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొన్నాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న వారికి షూటింగులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఆ వార్త క్షణాల్లో పాకిపోయింది. దీంతో అభిమానులు, చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి ఎక్కించేందుకు ఉత్సాహపడ్డారు

మార్గదర్శకానకిలీ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహంపోలీస్‌ ఎన్‌కౌంటర్లపై కొత్త


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 : నకిలీ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం నకిలీ ఎన్‌కౌంటర్లకు సంబంధించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సుప్రీం కోర్టు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నకిలీ ఎన్‌కౌంటర్లని తేలితే సంబంధిత అధికారులకు ప్రమోషన్లను నిలిపివేయడంతో పాటు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి న్యాయవిచారణకు ఆదేశించాలని కోర్టు పేర్కొంది.
 
నకిలీ ఎన్‌కౌంటర్ల విచారణను సీఐడీ ద్వారానే చేపట్టాలని స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌ వివరాలను రాతపూర్వంగా లేదా ఎలక్ర్టానిక్‌ విధానంలో నమోదు చేయాలని సుప్రీం తెలిపింది. ఎన్‌కౌంటర్‌లో వాడిన మందుగుండు సామాగ్రిని పరీక్షలకు పంపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన న్యాయవిచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఆరోపణలు ఎదుర్కుంటున్న సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఆలయ పాలక మండళ్ళ రద్దుపై పిటీషన్ : హైకోర్టులో చుక్కెదురు


High Court of APఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయ పాలక బోర్డు మండళ్ళను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 
 
ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే ఆర్డినెన్స్ ను చట్టరూపంలోకి తెచ్చామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అయింది. 
 
దేవాలయ పాలక మండళ్లను రద్దు చేసే అదికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానం తీర్పుతో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావడానికి మార్గం లైన్ క్లియర్ అయినట్లే.