Thursday 11 September 2014

చిరకాల శత్రువులు మిత్రులయ్యారు!


tummalaరాజకీయాల్లో శాశ్వత శత్రువులు మరియు శాశ్వత మిత్రులంటూ ఉండరని మరోసారి రుజువైంది. ఖమ్మం జిల్లాలో రాజకీయం తెలిసిన ఏ ఒక్కరిని అడిగినా కూడా తమ్ముల, జలగంల మద్య వైరం ఏంటో, ఎంతటిదో పూసగుచ్చినట్లు చెబుతారు. వీరిద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితులు గతంలో నెలకొని ఉండేవి. అయితే అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. వీరిద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఈ పరిణామం ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది.
కొన్ని రోజుల ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో విభేదాలను పక్కన పెట్టి జలగం వెంకట్రావు ఆయన్ను పరామర్శించాడు. ఆ తర్వాత తుమ్మల టీఆర్‌ఎస్‌లోకి చేరడం, ఖమ్మం టీఆర్‌ఎస్‌ బాధ్యతలు తుమ్మలకు కేసీఆర్‌ అప్పగించడం జరిగింది.తుమ్మల, జలగం భేటీ
ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా తుమ్మల అందరిని కలుపుకు పోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే తాజాగా జలగం వెంకట్రావు ఇంటికి స్వయంగా వెళ్లి దాదాపు గంట సమయం పాటు తుమ్మల ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఏకాంత చర్చల్లో పలు విషయాల గురించి వీరిద్దరి మధ్య అవగాహణ కుదిరినట్లు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వీరిద్దరు వచ్చారు.

No comments:

Post a Comment