సౌత్ ఇండియన్ మోస్ట్ బ్యూటిఫుల్ యక్ట్రస్ సమంత. ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసిందట ఈ అమ్మడు. అయితే, ఈ మధ్య నటించిన కొన్ని తెలుగు చిత్రాలతో పాటు తమిళ సికిందర్ కూడా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడు తెగ ఫీల్ అవుతోందట. దాంతో, ఇక లాభం లేదని ఈ అమ్మడు సర్జరీ చేయించుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
తన ముక్కు లావుగా ఉందని భావించిన సమంత రీ షేప్ చేయించుకోవడం కోసం తొందరలోనే లండన్ వెళ్లనుందట.
సమంత ఇప్పటికే లండన్ లో ఉన్న ఓ నోస్ రీ-షేపింగ్ సర్జరీ సెంటర్ ని అప్ప్రోచ్ అయిందని, అక్కడ అన్ని విషయాలు తెలుసుకుందని కోలీవుడ్ లో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇంకొన్ని రోజులలోనేసన్నటి ముక్కు కోసం చెన్నై బ్యూటీ ప్రయత్నంసమంత లండన్ కి వెళ్లి తన ముక్కుని సన్నగా మార్చుకోబోతున్నట్లు కోలీవుడ్ కథనం. అయితే, ఇప్పటికే సమంత తన ముక్కుకి రీ షేప్ చేయించుకుందని, కాక పోతే ఇక ఫైనల్ షేప్ కోసం మరో సారి వెళ్తుందని వినికిడి.
కాని, సర్జరీ గురించి సమంతని ఓ విలేకరి అడిగితే అవన్నీ పుకార్లేనని కొట్టి పారేసిందట ఈ జెస్సి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో, సమంత నిజంగానే కొత్త సోయగాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి వస్తుందో లేదో రాబోయే తన సినిమాలే చెప్తాయని ఇండస్ట్రీకి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment