“గజినీ” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ హీరో సూర్య. ఈ సినిమాలో సూర్య నటనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కాదు. ఈ సినిమా తరువాత దాదాపు సూర్య చిత్రాలు అన్నీ తెలుగులోకి డబ్ అవుతున్నాయి. అయితే, గజినీ సినిమా సాధించినంత ఘనవిజయం సూర్య నటించిన ఏ సినిమా తెలుగులో సాధించలేదనే చెప్పాలి. ఇదిలా ఉంటే, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకి హీరో సూర్య ఈ మధ్య ఓ సవాల్ విసిరాడట.
అదేదో సినిమా చాలెంజ్ అనుకునేరు. లేదండి. ఈ మధ్య ఐస్ బకెట్ సవాల్ యావత్ ప్రపంచంలో ఓ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే కదా. ఈ సవాల్ ప్రేరణతో రైస్ బకెట్ సవాల్ కూడా వచ్చి…. అది కూడా ఎక్కువుగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ఇదే దారిలో మళయాళ నటుడు మమ్ముట్టి “మై ట్రీ చాలెంజ్” ని ఆవిష్కరించారు. దేశంలో చెట్లు పెంచడం, పర్యావణాన్ని“మై ట్రీ చాలెంజ్” అంటున్న సూర్య కాపాడడం వంటి ప్రధాన ఉద్దేశాలతో మమ్ముట్టి ఈ సవాల్ ని మొదలు పెట్టి తమిళ్ హీరోలు సూర్య, విజయ్ అలాగే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు సవాల్ విసిరాడు. మమ్ముట్టి విసిరిన సవాల్ ని స్వీకరించిన సూర్య… మహేష్ బాబు, సుదీప్, అమీర్ ఖాన్ కు ఈ సవాల్ ని విసిరాడు.
ఇప్పుడు మహేష్ బాబు మీద ఈ సవాల్ స్వీకరించాల్సిన బాధ్యత ఉందన్న వార్తపై ప్రస్తుతం మహేష్ అభిమానులు తెగ ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 19న “ఆగడు” సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment