మొదటి ఇంజన్ లోని ఫ్యూయెల్ పంపును ముందురోజు రాత్రి మరమ్మతు చేశారని, ఆ తర్వాత దానికున్న నాలుగు స్క్రూలలో ఒకదాన్ని సరిగ్గా బిగించలేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దాంతో ఆ విమానానికి మెయింటెనెన్స్ ఇంజనీర్ గా వ్యవహరించి, సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తికి అధికారాలను డీజీసీఏ తొలగించింది.
ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, దాంతో విమానాన్ని వెనక్కి తిప్పి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశామని, తర్వాత వేరే విమానాల్లో వారిని పంపామని స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
No comments:
Post a Comment