అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత మార్పుకు బీజేపీ సైతం షాక్‌కు గురైంది. కొత్త అధ్యక్షుడు అమిత్‌షాకు ఈ ఫలితాలు ఖచ్చితంగా చేదు అనుభవాన్ని మిగిల్చాయంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ మ్యానియాతో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఓటర్లు అప్పుడే వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయ పడుతున్నారు.
గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాలు బలానిచ్చాయి. కాంగ్రెస్ 7 స్థానాలను దక్కించుకుని పరువు నిలుపుకుంది. యూపీలో బీజేపీకి ఈసారి తక్కువ ఓట్లు రావడంతో అప్పుడే బీజేపీ హవా తగ్గిందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో కూడా కాంగ్రెస్ పుంజుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతుంది. ఈ ఎన్నికల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడకుండా జాగ్రత్త పడాలని బీజేపీ నిర్ణయించుకుంది.
No comments:
Post a Comment