హైదరాబాద్ : మెదక్ ఉప ఎన్నిక ఫలితాన్ని తొక్కిపెట్టేందుకే మెట్రో రైలు ప్రాజెక్ట్ ను వివాదం చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. మెట్రోపై ఎల్ అండ్ టీ లేఖ రాసినట్లు మీడియాలో చూసినట్లు కేటీఆర్ అన్నారు. ఈ వార్తను కొందరు పనిగట్టుకుని రాసినట్లు ఉందని ఆయన విమర్శించారు.
మరోవైపు తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెట్రో ప్రాజెక్ట్ వివాదంపై చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో పనులు ఎక్కడా ఆగలేదని, కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్ అండ్ టీ లేఖ పాతదేనని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment