బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారమే ప్రకటన చేశారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అధికారులకు ఆ శాఖ పలు ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో ఉత్సవ ఏర్పాట్లు చేయాలని, శాఖల మధ్య సమన్వయం కోసం సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే ప్రదేశం ఎంపిక, సౌకర్యాలు, లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్, రక్షణ వంటి వాటిపై పలు ఆదేశాలిచ్చారు. మహిళా సంఘాలు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. అక్టోబర్ 2 న జరిగే బతుకమ్మ ఉత్సవాలకు సెప్టెంబర్ 29వ తేదీలోగానే ఏర్పాట్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులను సాంస్కృతిక శాఖ ఆదేశించింది.
No comments:
Post a Comment