Saturday, 13 September 2014

ఛండీగడ్ నమూనా బాగుంది: ఏపీ క్యాపిటల్‌పై నారాయణ

13-narayana-600
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు. తాము ఇప్పటి వరకు చూసిన రాజధానుల్లో చండీగఢ్ నుమానా బాగుందని అభిప్రాయపడ్డారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కోసం వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని సలహా కమిటీ పర్యటించి వచ్చిన తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ కమిటీ ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటిస్తుందని ఆయన చెప్పారు. 
 
అక్టోబర్ 5 నుంచి 9వ తేదీ వరకు చైనాలోని మూడు నగరాల్లో కమిటీ పర్యటిస్తుందని అన్నారు. ముంబై, ఢిల్లీ భూసేకరణ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
 
రాజధాని నిర్మాణానికి కనీసం 5 వేల హెక్టార్ల భూమి అవసరమని, ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని నారాయణ చెప్పారు. నెలలోగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ ఏర్పాటవుతుందని ఆయన చెప్పారు.
 
విజిటి చుట్టూ 184 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు. చండీగఢ్, తదితర ప్రాంతాలను నారాయణ కమిటీ ఇటీవల పరిశీలించింది.

No comments:

Post a Comment