మీ దగ్గర ఏటీఎం కార్డ్ లేదా? మరేం పర్లేదు. మీరు ఏటీఎం నుంచి దర్జాగా నగదు డ్రా చేయవచ్చు. ఎలా అనేగా మీ సందేహం? ఈ సౌలభ్యాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ప్రవేశపెట్టింది. నగదుని విత్ డ్రా చేయడంతో పాటు ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కు నగదుని ట్రాన్స్ఫర్ చేసే సదుపాయాన్ని ‘కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్’ ఫెసిలిటీలో భాగంగా ఐసీఐసిఐ అందిస్తోంది.
బ్యాంకు అకౌంట్ లేకపోయినా కూడా ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. 24 గంటలూ ఈ సౌలభ్యం వినియోగదారులకు అందుబాటులో
ఉంటుంది. కార్డ్ ఉపయోగించకుండా దాదాపు 10,000 ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.
ఎలక్రానిక్ పేమెంట్ ఆప్షన్లకు విపరీతంగా పెరుగుతున్న ఆదరణని దృష్టిలో పెట్టుకుని ‘కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్’ ఫెసిలిటీని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని ఐసీఐసిఐ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
No comments:
Post a Comment