భద్రాచలం జిల్లా సాధన కమిటీ పిలుపు
భద్రాచలం, సెప్టెంబర్ 13: ఉద్యమాల పురిటిగడ్డ భద్రాచలంలో మరో కొత్త ఉద్యమం పురుడు పోసుకుంది. జై ఆంధ్ర ఉద్యమం మొదలు నిన్నటి మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమం, భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే పోరాటం, ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలనే ఆందోళనలు... ఇలా నిత్యం ఉద్యమాలతో హోరెత్తిపోయే భద్రాచలం మన్యం కేంద్రంగా మరో ఉద్యమం తెరపైకి వచ్చింది. భద్రాచలం జిల్లా సాధన కమిటీ పేరిట పౌరసమితి నేతలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలుగా ఏర్పడి ఉద్యమాన్ని దశలవారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా పట్టణంలోని మేధావులు అందరూ కలిసి మేధోమథనం చేశారు. రాష్ట్ర విభజన వల్ల అధికంగా నష్టపోయింది భద్రాచలమే. తెలంగాణ రాష్టస్రమితి ఎన్నికల మ్యానిఫెస్టోతో పాటు గతంలో ఇక్కడ సింహగర్జనకు వచ్చినపుడు కూడా భద్రాచలాన్ని జిల్లాగా చేస్తామని ప్రకటించారు కూడా. పోలవరం కోసం జిల్లాలోని ఆదివాసీలను సీమాంధ్రులు పోలవరం ఆర్డినెన్స్‌పేరుతో తీసుకెళ్లిపోయారు. భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాలతో పాటుగా, పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు సీమాంధ్రలో కలిశాయి. ఫలితంగా భద్రాచలం ఒక్కటే ఒంటరిగా మిగిలింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా భాసిల్లే భద్రాచలం విభజన వల్ల తీవ్రంగా నష్టపోయింది. పూర్వ వైభవం తీసుకురావాలంటే జిల్లాగా ప్రకటించడమే ప్రత్యామ్నాయం. హైదరాబాద్ కోసం భద్రాచలాన్ని ముక్కలుచెక్కలు చేశారు. తిరిగి దానికి ప్రాచుర్యం తేవాల్సిన బాధ్యత కూడా పాలకులదే.

భద్రాచలం జిల్లా సాధన కమిటీ శ్రీసీతారామచంద్రస్వామికి విన్నపం ఇవ్వడం ద్వారా ఈ ఉద్యమానికి శనివారం శ్రీకారం చుట్టింది. కోడూరి సత్యనారాయణ, పి.సత్యనారాయణల నేతృత్వంలో డా.ఎస్.ఎల్.కాంతారావు, కొండిశెట్టి నాగేశ్వరరావు, సిద్దులు, సీపీఐ నేత టి.వెంకటేశ్వర్లు, భాజపా నేతలు మారెమళ్ల సుబ్బారావు, ఆవుల సుబ్బారావు, తెరాస నేత యశోద రాంబాబు, బొలిశెట్టి రంగారావు తదితరులు రామాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.
No comments:
Post a Comment