Friday, 5 September 2014

'ఐఎస్ఐఎస్'కు ఆకర్షితులైన హైదరాబాద్ విద్యార్థుల అరెస్ట్!

ఇరాక్‌లో నరమేధం సృష్టిస్తోన్న ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్'కు మన దేశంలోని ఓ వర్గానికి చెందిన యువత కూడా ఆకర్షితమవుతోంది. ఈ క్రమంలో, హైదరాబాదుకు చెందిన కొందరు విద్యార్థులు ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ఇక్కడ నుంచి బయలుదేరారు.
 
అయితే వీరు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొరికిపోయారు. వారం క్రితం హైదరాబాదుకు చెందిన నలుగురు విద్యార్థులను శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు బెంగాల్ పోలీసులు తెలిపారు. విద్యార్థులకు కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు వెల్లడించారు.
 
అయితే వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇంటర్నెట్‌లో ఐఎస్ఐఎస్‌ ప్రచారానికి విద్యార్థులు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు.
 
భారతదేశంలో మరో ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా తన శాఖను ప్రారంభిస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన నెలకొడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. ఈ నలుగురు యువకులతో పాటు మరికొందరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment