Friday, 5 September 2014

ఢిల్లీకి కేసీఆర్.. మోడీతో భేటీ: ఇకపై తెలుపు రంగు కార్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నెల 6, 7వ తేదీల్లో ఢిల్లీలో ఉండనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం లేఖ రాసింది. అనుమతి లభించింది. దీంతో గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం పదకొండు గంటలకు మోడీతో కేసీఆర్ భేటీ కానున్నారు.  
 
ఇకపోతే తన కాన్వాయ్‌లోని కార్ల రంగును మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్‌లో 6666 నెంబరు గల నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. వివిధ భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణి నలుపు రంగులో ఉంటుంది.
 
అయితే, ఈ నలుపు రంగు తనకు అచ్చిరావడం లేదని, తెలుపు రంగులోకి మార్చాలని కేసీఆర్ నిర్ణయించారని వినికిడి.

No comments:

Post a Comment