కేంద్ర మంత్రులను, ఎంపీలను, విదేశాల నుండి మహిళలను ఆహ్వానిస్తున్న కేసీఆర్ సోనియాను ఎందుకు వద్దనుకుంటున్నాడని అరుణ ప్రశ్నించారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుంచుకోవాలిసోనియా గాంధీగారితో పాటు అన్ని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలను, నాయకురాలను ఆహ్వనించాలని డిమాండ్ చేశారు. మెదక్ ఉపఎన్నికల గురించి ఈమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పనులను మానేసి మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా మెదక్ ఉపఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. అది వారి పరిస్థితిని తెలియజేస్తుందని ఈమె ఎద్దేవా చేశారు. ఇక ఈనెల 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం లాంచనంగా నిర్వహించాలంటూ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
No comments:
Post a Comment