Thursday, 4 September 2014

రాజధాని నిరసనలు... సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ....

విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విశాఖతో పాటు.. రాయలసీమ జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ విధ్యార్ధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. 
 
శివరామకృష్ణన్ కమిటీ విజయవాడను రాజధాని చేయవద్దని చెప్పినప్పట్టికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం రాజ్యాంగాన్ని అసహాస్యం చేయడమేనని వారు వ్యాఖ్యానించారు. స్వార్థం కోసం బెజవాడలో రాజధాని ప్రకటించడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు విద్యార్థి నేతలు తెలిపారు. 
 
విశాఖ రాజధాని కోసం విశాఖలో నిరసనలు వ్యక్తం అయితే, రాయలసీమలో ఏర్పాటు కావాలని అక్కడ వివిధ ప్రాంతాలలో నిరసనలు వచ్చాయి. రాజధానిగా విశాఖకు పలు అనుకూలతలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విజయవాడను ఎంపిక చేయడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించారు. అన్ని విధాలా వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరింత వెనక్కునెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. 

No comments:

Post a Comment