కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ (జడ్పీ) సమావేశం రసాభాసగా ముగిసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికార పక్షం ప్రజా సమస్యలపై చర్చంచడంలేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది.
సమస్యల పరిష్కారానికి అధికార పక్షానికి చిత్తశుద్ది లేదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వాకౌట్ చేశారు. అనంతరం జడ్పీహాల్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు
No comments:
Post a Comment