కొన్ని రోజుల ముందు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో విభేదాలను పక్కన పెట్టి జలగం వెంకట్రావు ఆయన్ను పరామర్శించాడు. ఆ తర్వాత తుమ్మల టీఆర్‌ఎస్‌లోకి చేరడం, ఖమ్మం టీఆర్‌ఎస్ బాధ్యతలు తుమ్మలకు కేసీఆర్ అప్పగించడం జరిగింది.తుమ్మల, జలగం భేటీ
ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా తుమ్మల అందరిని కలుపుకు పోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే తాజాగా జలగం వెంకట్రావు ఇంటికి స్వయంగా వెళ్లి దాదాపు గంట సమయం పాటు తుమ్మల ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఏకాంత చర్చల్లో పలు విషయాల గురించి వీరిద్దరి మధ్య అవగాహణ కుదిరినట్లు తెలుస్తోంది. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వీరిద్దరు వచ్చారు.
No comments:
Post a Comment