ఇంతకుముందు వేరే వేరే భాషలలో హిట్టైన చిత్రాలలోని సీన్స్,కథలు తెలుగుదనం అద్దుకుని దిగేవి...దాంతో ఎంతో కొంత కొత్తదనం చూస్తున్నాం అనే ఫీల్ ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారినట్లుంది. తెలుగులో హిట్టైన సినిమాలు నాలుగు తీసుకుని ఓ కథని వండేసి వడ్డించేస్తున్నారు. అలాంటి పరమ రొటీన్ వంటకమే ..‘పవర్' టైటిల్ తో దిగింది. అల్లుడు శీను,బలుపు చిత్రాలకు కథలు అందించిన బాబి దర్శకుడుగా మారి అందించిన ఈ చిత్రం మాస్ ఎలిమెంట్స్ ని అద్దాలనే తాపత్రయమే తప్ప, మిగతా విషయాలపై దృష్టి పెట్టినట్లు కనపడదు. అయితే రవితేజ ఫెరఫార్మెన్స్, ఆయన పాడిన నోటంకి పాట సినిమాకు ఉన్నంతలో దన్నుగా నిలిచాయి. కలకత్తాలో బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ అవినీతి పోలీసు అధికారి. అతను గంగూలీ భాయ్ (సంపత్ రాజ్) అనే గ్యాంగస్టర్ ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో సేవ్ చేసి, అండర్ గ్రౌండ్ కు తీసుకువెళ్లాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తన ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే హైదరాబాద్ లో ...తిరుపతి(రవితేజ) పోలీస్ ఉద్యోగం కావాలని, అదే జీవితాశయంగా తిరుగుతున్న కుర్రాడు. అతన్ని విలన్(ముకేష్ రుషి) ఓ రోజు టీవిలో చూస్తాడు. దాంతో అతన్ని తీసుకువచ్చి చనిపోయిన బలదేవ్ సహాయ్ ప్లేస్ లో ప్రవేశపెట్టి తన పనులు జరుపుకోవాలనుకుంటాడు. అప్పుడు అసలైన ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి...విలన్స్ కు హీరో ఎలా బుద్ది చెప్పాడు...బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనేది మిగతా కథ. రవితేజ సూపర్ హిట్ విక్రమార్కుడు చిత్రం కు చిన్న ట్విస్ట్ కలిపి మరో వెర్షన్ లా ఉండే ఈ చిత్రంలో ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో వచ్చిన రొటీన్ సీన్స్ కు తోడు,రొటీన్ కథ,కథనం కూడా తోడైంది. చివరకు క్లైమాక్స్ సైతం రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన బలుపునే తిరిగి చెయ్యాలనుకోవటం దారుణమనిపిస్తుంది. సందర్బం ఉన్నా లేకపోయినా బ్రహ్మానందంపై పాట పెట్టేస్తే జనం ఎగబడి చూసేస్తారనే భ్రమలా అనిపిస్తుంది. సాధారణంగా కమర్షియల్ చిత్రాల్లో కథలో నమ్ముకున్న ట్విస్ట్ లు పేలకపోయినా లేకపోతే ట్విస్ట్ లు సరిగ్గా లేకపోయినా చాలా ప్రెడిక్టబుల్ గా కథ,కథనం నడుస్తాయి. అదే ఈ సినిమాకు జరిగింది. ఎక్కడో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ పెట్టుకుని దాని చుట్టూ అల్లుకుంటూ వచ్చినట్లుంది. మిగతా రివ్యూ స్లైడ్ షోలో..
No comments:
Post a Comment