ఇటీవలి కాలంలో తెలంగాణలోని 10 జిల్లాలను విభజించబోతున్నారని, కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తొలుత 10 జిల్లాలను 24 జిల్లాలుగా విభజించనున్నారని కొన్ని పత్రికలలో, కాదు కాదు... ప్రస్తుతానికి ఏడు జిల్లాలను మాత్రమే పెంచుతున్నారని మరికొన్ని పత్రికలలో వచ్చాయి. ఈ జిల్లాలల పెంపు విషయంలో తెలంగాణ ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు వుంటుందని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నట్టు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో వస్తున్న వార్తా కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయిన తర్వాతనే నూతన జిల్లాల ఏర్పాటు తెర మీదకు వస్తుందన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 జిల్లాలతో పాటు మరో 7 కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ కొత్త జిల్లాలపై మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొత్త జిల్లాల వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు.
No comments:
Post a Comment