మెదక్, సెప్టెంబర్ 16 : తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటామని టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఆత్మబలిదానాలు చేసుకున్నారో వారికి తన విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తన విజయం వెనుక టీ. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని... వారందరిక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment