Saturday, 6 September 2014

రెండు బస్తాలు కాదు.. రెండు సూట్‌కేసుల్లో బ్లూఫిల్మ్ సీడీలు!

చెన్నైలోని కోయంబేడు బస్టాండులో చెన్నై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి బ్లూఫిల్మ్ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నగర పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా స్థానిక కోయంబేడులోని సీఎంబీటీ బస్టాండులోని ఐదో నంబర్ ఫ్లాట్‌ఫారంపై ఉన్న రెండు సూట్ కేసులను పోలీసులు గుర్తించారు. 
 
ఇవి అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. కవర్లు లేని ఈ సీడీలను ప్లే చేసి చూడగా, బ్లూ ఫిల్మ్ సీడీలని గుర్తించారు. ఈ రెండు సూట్ కేసుల్లో మొత్తం ఐదు వేల సీడీలు ఉన్నట్టు గుర్తించారు. 
 
వీటిని చెన్నై నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సరఫరా చేయడానికి వాటీ తయారీదారులు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. ఈ సీడీలు చెన్నైలోని వివిధ ప్రాంతాలలో ఉన్న సీడీల విక్రయ కేంద్రాలకు తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 

No comments:

Post a Comment