Friday, 5 September 2014

అన్నం, 40 రూపాయిల కోసం హత్య

జంషెడ్ పూర్: భోజనం, 40 రూపాయిల కోసం ఓ వ్యక్తి యజమానితో ఘర్షణపడి కత్తితో పొడిచి చంపాడేశాడు. జార్ఖండ్ లో ఈ సంఘటన జరిగింది.

ఘాట్ శిల సమీపంలోని భీటర్ మింద గ్రామంలో ఓ వృద్ధుడు పశువులను మేపడానికి ఓ వ్యక్తిని దినసరి కూలి కింద నియమించుకున్నాడు. రోజుకు కాస్త భోజనం, 40 రూపాయిలు ఇచ్చేలా మాట్లాడుకున్నాడు. అయితో గురువారం భోజనం, డబ్బు ఇవ్వడంలో ఆయన ఆలస్యం చేశాడు. ఈ విషయంపై కూలీ యజమానితో ఘర్షణ పడ్డాడు. కత్తితో పొడిచిచంపేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment