ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇంట్లో తన ఫోటో ఉండటం తనకు లభించిన అత్యుత్తమ గౌరవమని క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. బ్రాడ్ మన్ రూపొందించిన 'పదకొండు మంది ఆల్ టైమ్ టెస్ట్ క్రికెటర్ల జాబితాలో తన ఫోటో ఉండటం గొప్ప అదృష్టమని' సచిన్ తెలిపారు.
1994-95లో బ్రాడ్‌మన్, నా బ్యాటింగ్ శైలి అతని బ్యాటింగ్ శైలితో పోలి ఉందని తన భార్య చెప్పారు. నా జీవితంలో అదొక అధ్బుతమైన క్షణం. 'జీవితంలో తాను అందుకున్న అతి పెద్ద అభినందన సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇచ్చారని' సచిన్ అన్నారు.
ఆస్టేలియా ప్రధాని టోని అబాట్ సమక్షంలో ఆదేశ కాన్సులేట్ చేసిన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లో పొల్గోన్న సచిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2007 సిడ్నీలో మ్యాచ్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాట్‌ని పట్టుకోని వచ్చానని సంఘటనను గుర్తుచేసుకున్నారు.
త్వరలో ఆస్టేలియా, న్యూజిలాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌కు భారత్ సిద్దంగా ఉందన్నారు. ఢిపెండింగ్ ఛాంపియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకునే సత్తా టీమిండియాకు ఉందని చెప్పారు. టీమిండియాలో యువకులు ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నారని' అన్నారు. '1991-92లో జరిగిన ఆస్టేలియా, న్యూజిలాండ్ ప్రపంచ కప్ టూర్ ఎన్నో అనుభూతులను మిగిల్చిందన్నారు.
No comments:
Post a Comment