ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్ రావుకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్ రావు- ఎర్రబెల్లి సవాల్ కు ధీటుగా స్పందించారు.
జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఎర్రబెల్లి సిద్ధమా అని ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్‌కూ హరీష్ రావు సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి టిక్కెట్ ఇప్పించిన వీరిద్దరూ దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల ప్రచారానికి రావాలంటూ సవాల్ చేశారు. హారీష్ సవాల్‌కు చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
No comments:
Post a Comment