నటీనటులు: రవితేజ, హన్సిక, రెజీనా, బ్రహ్మానందం, ముఖేష్‌రుషి, రావు రమేష్, సంపత్‌రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి తదితరులు
స్క్రీన్‌ప్లే: చక్రవర్తి,
సంగీతం: తమన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.బి.కృష్ణ,
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి).
నిర్మాత :రాక్‌లైన్ వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె.బి.కృష్ణ,
రిలీజ్ డేట్ : 12, సెప్టెంబర్ 2014.
ప్రస్తుతం ట్రెండ్ మారింది. నాలుగు హిట్ సినిమాల నుంచి ఓ కథనే కొత్త హంగులతో ప్రేక్షకులకు వడ్డించేస్తున్నారు. ఇలాంటి రొటీన్ సినిమానే రవితేజ.. మాస్ మహారాజ "పవర్". ఈ సినిమాకు పాత చింతకాయ పచ్చడినే.. కొత్త సీసాలో.. పాత సారానే టాక్ వచ్చేసింది.
అల్లుడు శీను, బలుపు చిత్రాలకు కథలు అందించిన బాబి దర్శకుడుగా మారాడు. పవర్ సినిమాను మాస్‌కు నచ్చినట్లు తీసిన బాబి ప్రయత్నం పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో రవితేజ ఫెర్‌ఫార్మెన్స్, ఆయన పాడిన నోటంకి పాట సినిమాకు ఉన్నంతలో దన్నుగా నిలిచాయి.
కలకత్తాలో బలదేవ్ సహాయ్ (రవితేజ) ఓ అవినీతి పోలీసు అధికారి. అతను గంగూలీ భాయ్ (సంపత్ రాజ్) అనే గ్యాంగస్టర్‌ని కోర్టుకు తీసుకువెళ్తున్న సమయంలో సేవ్ చేసి, అండర్ గ్రౌండ్‌కు తీసుకువెళ్లాలనుకుంటాడు.
ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోతాడు. కట్ చేస్తే హైదరాబాద్‌లో... తిరుపతి(రవితేజ) పోలీస్ ఉద్యోగం కావాలని, అదే జీవితాశయంగా తిరిగే వాడిని.. విలన్ (ముకేష్ రుషి) ఓ రోజు టీవిలో చూస్తాడు. దాంతో అతన్ని తీసుకువచ్చి చనిపోయిన బలదేవ్ సహాయ్ ప్లేస్‌లో ప్రవేశపెట్టి తన పనులు జరుపుకోవాలనుకుంటాడు.
అప్పుడు అసలైన ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి...విలన్స్‌కు హీరో ఎలా బుద్ది చెప్పాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. పాత్రల పరంగా రవితేజ, బ్రహ్మానందం అదరగొట్టారు. హన్సిక, రెజీనాలు గ్లామర్‌కే పరిమితం అయ్యారు. మిగిలిన పాత్రలు తమ క్యారెక్టర్‌కు న్యాయం చేశారు.
కానీ సినిమా మాత్రం నాలుగైదు తెలుగు సినిమాలను కాపీ కొట్టినట్లుందని టాక్ వచ్చేసింది. ఏమైనా రవితేజ మాస్ మసాలాకు మాత్రం పవర్ ఏమాత్రం తీసిపోలేదని సినీ పండితులు అంటున్నారు. ఆయన బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టు పవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
No comments:
Post a Comment