Saturday, 13 September 2014

మెదక్, నందిగామ పోలింగ్ పూర్తి

తెలంగాణలోని మెదక్ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌ క‌ష్ణాజిల్లా నందిగామ శానసనభ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. మెదక్ లోక్‌సభ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 63.14 శాతం, నందిగామలో 63 శాతం ఓట్లు పోలయ్యాయి. మెదక్ లోక్‌సభ పరిధిలోని సిద్దిపేటలో 64.5, మెదక్‌లో 63, నర్సాపూర్‌లో 76, సంగారెడ్డిలో 60, పటాన్‌చెరులో 49, దుబ్బాకలో 64.5, గజ్వేల్‌లో 65 శాతం ఓట్లు పోలయ్యాయి.

No comments:

Post a Comment