హైదరాబాద్: దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సమరం ముగిసింది. 10 రాష్ర్టాల్లోని 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. మెదక్, వడోదర, మెయిన్‌పురి మూడు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని 11 అసెంబ్లీ స్థానాలకు, గుజరాత్‌లోని 9 అసెంబ్లీలు, రాజస్థాన్‌లోని 4 అసెంబ్లీ స్థానాలు, బెంగాల్‌లోని 2 శాసనసభ స్థానాలు, ఈశాన్య రాష్ర్టాల్లోని 5 అసెంబ్లీలకు, ఏపీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఒకో అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు.
No comments:
Post a Comment