హైదరాబాద్: నాలుగు వేల మంది అమరుల ప్రాణత్యాగాలు ఫలించిన రోజు...లక్షలాది తెలంగాణ ప్రజల ఆశలు చిగురించిన రోజు...రజాకార్ల రాక్షసత్వం నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన రోజు సెప్టెంబర్ 17..తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి విజయం చేకూరిన రోజు.. ఇంతటి విశిష్టత, మరెంతో ఆవశ్యకత ఉన్న సెప్టెంబర్ 17ను ఎవరికి వారు తమదైన రీతిలో సూత్రీకరిస్తూ వస్తున్నారు.
1948 సెప్టెంబర్ 17న విముక్తి...
1948 సెప్టెంబర్ 17న నైజాం సంస్థానంగా పిలవబడిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసింది. ఈ సందర్భాన్ని నైజాం నుంచి విముక్తి పొందిన రోజు, రైతాంగ పోరాటం విజయం సాధించిన రోజుగా కొన్ని పార్టీలు జరుపుకుంటుండగా.. భారతదేశంలో విలీనమైన రోజు మాత్రమేనని మరికొన్ని పార్టీలు చెబుతున్నాయి. ఇంకొన్ని పార్టీలైతే దీన్ని విద్రోహ దినంగా పాటిస్తున్నారు.
కర్నాటక, మహారాష్ట్రలో అధికారిక ఉత్సవాలు...
1947లో దేశానికి స్వాతంత్రం లభిస్తే.. హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్రలోని పలు జిల్లాలు 1948 సెప్టెంబర్ 17న విముక్తి పొందాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో ఈ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. కానీ.. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజును గుర్తించేందుకు ప్రభుత్వాలు అంగీకరించలేదు. మరి, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అయిన టీఆర్‌ఎస్ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో గుర్తించని ప్రభుత్వాలు
హైదరాబాద్ లో బలం పుంజుకోవడంలో భాగంగా మైనార్టీలకు దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్ పలు వ్యూహాలు అమలు చేస్తోంది. అయితే.. నైజాంకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజలు విజయం సాధించిన రోజును తెలంగాణ ప్రభుత్వం ఎలా నిర్వహించనుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది

No comments:
Post a Comment