మహబూబ్ నగర్ : జిల్లా వనపర్తిని నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్నికల సమయమంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూలును రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఇప్పుడేమో నాగర్‌కర్నూలును మాత్రమే జిల్లాగా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం ఎంతవరకు సమంజసమని చిన్నారెడ్డి ప్రశ్నించారు. వనపర్తిని జిల్లాగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగిస్తానని ఎమ్మెల్యే చెప్పారు.
కాంగ్రెస్ లో రగడ..
వనపర్తిని జిల్లా కేంద్రంగా చేస్తామంటూ కేసీఆర్ గతంలో ప్రకటించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తొలివిడత నాగర్ కర్నూలును ప్రకటించారు. కానీ ఈ విషయంపై కాంగ్రెస్ లో రగడ మొదలైంది. గద్వాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ గళమెత్తగా..వనపర్తి ఉత్తమం అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి పేర్కొంటున్నారు. ఎన్నాళ్లుగానో కొత్త జిల్లాల ఏర్పాటుపై సాగుతున్న చర్చపై వీళ్లద్దరూ తలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను టిఆర్ఎస్ సర్కార్ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

No comments:
Post a Comment