Thursday, 4 September 2014

40 సెకండ్లకో ఆత్మహత్య

ఈ జీవితం చాలా విలువైనది. అటువంటి విలువైన జీవితాన్ని కొంత మంది క్షణికావేశంలో అంతం చేసుకుంటున్నారు. ఒక నివేదిక ప్రకారం ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని తేలింది.
వివరాల్లోకి వెళితే, ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్న మూడు వారాలకు విడుదలైన ఒక నివేదిక ఆత్మహత్యలపై భయాందోళనలను కలిగించే వాస్తవాలను బయటపెట్టింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దాదాపు ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అంచనా.
ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలను మీడియాలో ప్రసారం చేయకూడదనిఆత్మహత్యలను నిరోధించవచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీడియాకి సూచించింది. ఇటువంటి వార్తలు ప్రేక్షకులపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశాలు ఎక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడింది.
ఆత్మహత్యలను నిరోధించవచ్చు. ఆత్మహత్యలను నిరోధించడానికి దేశాలన్నీ తగిన చర్యలు తీసుకోవాలి. సెలెబ్రిటీల అత్మహత్యలని సెన్సేషనల్ వార్తలలా ప్రసారం చేసే మీడియా ధోరణి మారాలి. ఇటువంటి వార్తలు ఆత్మహత్యల శాతాన్ని మరింత పెంచే అవకాశం కలదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయపడింది.

No comments:

Post a Comment