మంచు విష్ణు, తేజస్వి జంటగా తెరకెక్కిన ‘అనుక్షణం’ చిత్రాన్ని ఇంటర్వెల్ లేకుండా విడుదల చేయబోతున్నాడు వర్మ. తక్కువ నిడివితో రాబోతుందేమో తెలుగు సినిమాల నిడివి సహజంగా రెండున్నర గంటలుంటుంది. అందులో సగం టైం తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. ఇలాగే తెలుగు ప్రేక్షకులు అలవాటు పడ్డారు. కాని తాజాగా ‘అనుక్షణం’ చిత్రానికి మాత్రం ఇంటర్వెల్ లేకుండా ఏకధాటిగా సినిమా ఉండనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. హాలీవుడ్ సినిమాలు గంటన్నర నిడివితో ఇంటర్వెల్ లేకుండా ఉంటాయి. మరి ‘అనుక్షణం’ కూడా తక్కువ నిడివి ఉండటం వల్ల ఇంటర్వెల్ ఇవ్వలేదేమో అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
No comments:
Post a Comment