సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్, సూడాన్ దేశాలకు చెందిన సుమారు 500 మంది వలస కూలీలతో ప్రయాణిస్తున్న ఓ భారీ నౌక మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు ఐవోఎం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదం నుంచి బయటపడిన పాలస్తీనాకు చెందిన ఇద్దరు వ్యక్తులతో ఐవోఎం ప్రతినిధుల బృందం ముఖాముఖి నిర్వహించింది. సెప్టెంబర్ 6న ఈజిప్టులోని దిమిత్తా పోర్ట్ నుండి తాము బయలుదేరామని, ఓడలో సుమారు 500 మందికి పైగా ఉన్నట్లు వారు తెలిపారని ఐవోఎం తెలిపింది. ఇటీవల జరిగిన ఓడ ప్రమాదాల్లో ఇవి అతి పెద్ద ప్రమాదాలని ఐవోఎం పేర్కొంది.
No comments:
Post a Comment