మెదక్, సెప్టెంబర్ 13 : మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో మధ్యాహ్నం వరకు 65శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒంటిగంట సమయానికి అత్యధికంగా నర్సాపూర్‌లో75 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా పటాన్‌చెరులో 47 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 95 శాతం పోలింగ్ దాటే ప్రాంతాలకు రూ.2లక్షల వరకు అధికారులు నజరానా ప్రకటించినప్పటికీ తక్కువ శాంత పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.నందిగామ లో65శాతం పోలింగ్ నమోదు
No comments:
Post a Comment