Saturday, 13 September 2014

ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా

త్రిపురలో సెల్‌ఫోన్ సరదా ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసింది. పశ్చిమ త్రిపురలోని తకర్జల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్ లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలిసి హాస్టల్ వార్డెన్ ఆ ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ముగ్గురు అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ హాస్టల్ నుంచి పారిపోయారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, సెల్‌ఫోన్ విషయంలో మందలించినందువల్లే ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు చెబుతున్నారు. 

No comments:

Post a Comment