Saturday, 13 September 2014

మెదక్ ఎన్నికలో పోలింగ్ 65 శాతంపైనే

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో మొత్తం మీద గతసారి మాదిరే దాదాపు పోలింగ్ జరిగింది.సుమారు అరవైఐదు శాతం పోలింగ్ జరిగింది.ఇది ఇంకా పెరగవచ్చు.కాగా మెదక్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు ఖాయంగా కనిపిస్తున్నదని మీడియాలో అంచనాలు వస్తున్నాయి.ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమంటు సీటుకు కూడా పోటీచేసి గెలిచిన ఈ నియోజకవర్గం సహజంగానే ప్రతిష్టాత్మకమైనది కావడంతో దీనికి ఆసక్తి ఏర్పడింది. బిజెపి, కాంగ్రెస్ ల మధ్య రెండో స్థానానికి పోటీ పడుతున్నాయని అంటున్నారు.కాగా నందిగామ ఉప ఎన్నికలో కూడా అరవై శాతం పైగా ఓట్లు నమోదయ్యాయి. అక్కడ టిడిపి అభ్యర్ధి గెలుపు అవకాశాలు ఉన్నాయి

No comments:

Post a Comment